Team India: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఇదే..!!
ABN, First Publish Date - 2023-12-01T20:59:16+05:30
Team India: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది. రింకూ సింగ్ (46), జైశ్వాల్ (37), జితేష్ శర్మ (35), గైక్వాడ్ (32) రాణించారు. సూర్యకుమార్ (1), శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (0) విఫలం చెందారు. తొలి వికెట్‌కు గైక్వాడ్, జైశ్వాల్ 50 పరుగులు జోడించినా ఆ తర్వాత వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షిస్ 3 వికెట్లు పడగొట్టగా.. జాసన్ బెరన్ డార్ఫ్, తన్వీర్ సంఘా తలో రెండు వికెట్లు సాధించారు. అరోన్ హార్డీ ఒక వికెట్ తీశాడు.
మరోవైపు నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన అతడు టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 4వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 116 ఇన్నింగ్స్‌లలో రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో అతడి తర్వాత కేఎల్ రాహుల్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ 117 ఇన్నింగ్స్‌లలో 4వేల పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడు కేవలం 107 ఇన్నింగ్స్‌లలోనే 4వేల పరుగుల మార్క్ అందుకున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-01T20:59:18+05:30 IST