ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tom Blundell: పింక్‌బాల్ టెస్టులో ఎవరూ సాధించని ఘనత సొంతం చేసుకున్న టామ్!

ABN, First Publish Date - 2023-02-17T20:15:36+05:30

న్యూజిలాండ్(New Zealand) వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెన్(Tom Blundell ) చరిత్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మౌంట్ మాంగనూయి: న్యూజిలాండ్(New Zealand) వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెన్(Tom Blundell ) చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టు(Pink-Ball Test)లో సెంచరీ సాధించిన టామ్.. ఆ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌(wicketkeeper Batter)గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ‌లో కివీస్ 306 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టామ్ 181 బంతుల్లో 138 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. టామ్ సెంచరీ పుణ్యమా అని కివీస్ భారీ స్కోరు సాధించగలిగింది. జట్టులో టామ్ తర్వాత తర్వాత కాన్వే చేసిన 77 పరుగులే రెండో అత్యధికం.

అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్(England) రెండో రోజు ఆట ముగిసే సమయానికి 79 పరుగులు చేసి 98 పరుగుల ఆధిక్యం సాధించింది. కాగా, 2015 నుంచి పింక్ బాల్ టెస్టులు ప్రారంభమయ్యాయి. రెడ్ బాల్ టెస్టులతో పోలిస్తే ఇవి చాలా పరిమితంగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య టెస్టు ప్రారంభానికి ముందు 20 డే/నైట్ టెస్టులు మాత్రమే జరిగాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క వికెట్ కీపర్ బ్యాటర్ కూడా సెంచరీ సాధించలేకపోయాడు. ఇప్పుడు తొలిసారి బ్లండెన్ ఆ ఘనత అందుకున్నాడు.

Updated Date - 2023-02-17T20:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising