ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్

ABN, First Publish Date - 2023-11-15T17:49:23+05:30

రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు, నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి.. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే.. తన కెరీర్‌లో అతడు బద్దలుకొట్టని, సాధించని రికార్డ్ అంటూ ఏదీ లేదు.

రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు, నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి.. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే.. తన కెరీర్‌లో అతడు బద్దలుకొట్టని, సాధించని రికార్డ్ అంటూ ఏదీ లేదు. క్రికెట్ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’ అనుకుంటూ దూసుకుపోతున్నాడు. అసాధ్యమనుకున్న ఎన్నో చారిత్రాత్మక ఫీట్లను సుసాధ్యం చేసి చూపించాడు. ఎందరో హేమాహేమీలు తమ జీవితకాలంలో సాధించలేకపోయిన రికార్డులన్నింటిని అనతికాలంలోనే విరాట్ కోహ్లీ సృష్టించాడు. ఇప్పటికీ ఆకలి తీరని పులిలాగా రికార్డులను వేటాడుతున్న కోహ్లీ.. తాజాగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఎన్నో ఘనతలు సాధించాడు.


సెమీఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి.. వన్డేల్లోనూ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇంతకుముందు 49 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉంటే.. తాజా సెంచరీతో కోహ్లీ 50 సెంచరీల మార్క్‌ని అందుకొని, సచిన్‌ని వెనక్కు నెట్టేశాడు. అంతేకాదు.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 2003 వరల్డ్ కప్‌లో 673 పరుగులు సాధించి.. అప్పట్లో చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఇన్నేళ్ల, అంటే 20 సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్‌ని కోహ్లీ బద్దలుకొట్టాడు. 2023 వరల్డ్ కప్‌ టోర్నీలో అతడు 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 709 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.

అంతేకాదండోయ్.. టీ20, ఐపీఎల్‌లోనూ అలాంటివే రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 319 పరుగులు నమోదు చేసి.. ఈ ఫార్మాట్‌లో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. 2016లో 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులతో ఊచకోత కోశాడు. ఆ సీజన్‌లో అతడు ప్రతి మ్యాచ్‌లోనూ పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు. తన జట్టు విఫలమైనా.. తాను మాత్రం ఒక ‘కింగ్’లాగా ఒంటరి పోరుని కొనసాగించాడు. ఇప్పటివరకూ దీని దరిదాపుల్లోకి ఏ ఒక్కరూ రాలేకపోయారు. ఇలా తన పేరిట ఎన్నో రికార్డుల్ని లిఖించుకున్నాడు కాబట్టే.. కోహ్లీని ‘రికార్డుల రారాజు’గా పిలుస్తుంటారు.

Updated Date - 2023-11-15T17:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising