ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: కింగ్ ఆఫ్ రికార్డ్స్.. సచిన్ రికార్డ్ సమం.. సౌతాఫ్రికాపై అరుదైన మైలురాయి

ABN, First Publish Date - 2023-11-05T19:09:39+05:30

క్రికెట్ వరల్డ్‌లో రికార్డులు నమోదు చేయడం కోసం ఇతర క్రికెటర్లు నానా తంటాలు పడుతుంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం రికార్డులే అతని చెంతకు చేరుతున్నాయి. అతి తక్కువ కాలంలో..

క్రికెట్ వరల్డ్‌లో రికార్డులు నమోదు చేయడం కోసం ఇతర క్రికెటర్లు నానా తంటాలు పడుతుంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం రికార్డులే అతని చెంతకు చేరుతున్నాయి. అతి తక్కువ కాలంలో అతను సాధించిన ఘనతలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అసలు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన సెంచరీల రికార్డుల దరిదాపుల్లోకి ఎవ్వరూ వెళ్లలేరని అనుకున్న తరుణంలో.. నేనున్నానంటూ కోహ్లీ పరుగుల ప్రవాహంతో దూసుకొచ్చాడు. ఫైనల్‌గా అతడు వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన సచిన్ (49) రికార్డును సమం చేశాడు. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో సెంచరీ చేసి.. ఆ ఘనత సాధించాడు. అందునా.. తన పుట్టినరోజు నాడు కోహ్లీ ఈ ఫీట్ సాధించడంతో.. అతని కెరీర్‌లో ఇది చాలా స్పెషల్‌గా నిలిచిపోతుంది. అభిమానులు సైతం ఈ సెంచరీని ఎంజాయ్ చేస్తున్నారు.


నిజానికి.. 2019-22 మధ్యకాలంలో విరాట్ కోహ్లీ ఊహించని పతనం చవిచూశాడు. అంతకుముందు సెంచరీల మోత మోగించేసిన కోహ్లీ.. ఆ గ్యాప్‌లో మాత్రం (రెండున్నరేళ్లకు పైగా) ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అన్ని ఫార్మాట్‌లలోనూ అతడు ఘోరంగా విఫలమయ్యాడు. అర్థశతకం చేయడం కూడా అతనికి గగనమైపోయిన రోజులవి. అప్పుడే కోహ్లీపై ఎనలేని విమర్శలు వచ్చిపడ్డాయి. ఇక కోహ్లీ పనైపోయిందని, అతడ్ని జట్టులో నుంచి తొలగించడమే బెటరనే కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలోనే కోహ్లీ తన కెప్టెన్సీకి స్వస్తి పలికాడు. అది చూసి.. రిటైర్‌మెంట్ కూడా ప్రకటిస్తాడేమోనని అంతా అనుకున్నాడు. కానీ.. పడిలేచిన కెరటంలాగా అతడు తిరిగి పుంజుకున్నాడు. 2022లో జరిగిన టీ20 ఆసియా కప్‌లో సెంచరీ చేసి.. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ పాత కోహ్లీలాగే సత్తా చాటడం మొదలుపెట్టాడు. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ.. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో రికార్డులను నెలకొల్పుతున్నాడు.

మరో విశేషం ఏమిటంటే.. సచిన్ 452 ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు సాధిస్తే, కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49 సెంచరీలు చేశాడు. ఇన్నింగ్స్‌ల పరంగా ఉన్న వ్యత్యాసాన్ని బట్టి చూస్తే.. విరాట్ కోహ్లీ సాధించింది ఎంతో అసాధారణమైన ఫీట్ అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కోహ్లీ మరో ఫీట్ కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి.. సౌతాఫ్రికాపై 3 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. సౌతాఫ్రికాపై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్‌లాడిన కోహ్లీ.. 3,058 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సెంచరీ విషయానికొస్తే.. జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన కోహ్లీ, చివరివరకూ క్రీజులో నిల్చొని 121 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Updated Date - 2023-11-05T19:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising