ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: ఫైనల్‌కు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

ABN, First Publish Date - 2023-09-16T15:41:22+05:30

స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసియా కప్ ఫైనల్ ఆదివారం నాడు కొలంబో వేదికగా టీమిండియా, శ్రీలంక మధ్య జరగనుంది. అయితే ఫైనల్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. తొలుత ఫీల్డర్ విసిరిన బంతి కారణంగా కుడిచేతి వేలుకు గాయం కాగా.. ఆ తర్వాత తొడ ప్రాంతంలో కూడా గాయమైనట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించేందుకు అక్షర్ పటేల్ శతవిధాలుగా ప్రయత్నించాడు. కానీ 42 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ కావడంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

అయితే అక్షర్ పటేల్ ఫైనల్లో కచ్చితంగా ఆడతాడు.. ఆడలేడు అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. మ్యాచ్‌కు ముందే ఈ విషయం తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అక్షర్ పటేల్ దూరమైతే మరో స్పిన్ ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడంతో ముందస్తుగా వాషింగ్టన్ సుందర్‌ను పిలిపించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాషింగ్టన్ సుందర్ శ్రీలంకకు వెళ్లినా.. అక్షర్ పటేల్ స్థానంలో అతడికి తుదిజట్టులో స్థానం దక్కడం అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా స్థానం సంపాదించిన అక్షర్ పటేల్ గాయం తీవ్రం కాకుండా ఉండాలంటే అతడికి విశ్రాంతి కల్పించడమే ఉత్తమం అని పలువురు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Water boy : విరాట్‌.. వాటర్‌ బాయ్‌

కాగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోంది. దీంతో గత మూడు మ్యాచ్‌లలో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌లలో టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ విజృంభించాడు. అటు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే కూడా 5 వికెట్లతో రాణించాడు. టీమిండియాపై బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా అదరగొట్టారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో బ్యాకప్‌గా ఎవరికి స్థానం దక్కుతుందో వేచి చూడాలి.

Updated Date - 2023-09-16T15:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising