ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T20 World Cup 2024: రిషబ్ పంత్ వస్తే.. కేఎల్ రాహుల్ పరిస్థితేంటి?

ABN, First Publish Date - 2023-12-13T18:57:22+05:30

T20 World Cup 2024: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్‌లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్‌లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై కేఎల్ రాహుల్ ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్, సెలక్టర్లతో చర్చించినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి వికెట్ కీపర్‌ స్లాట్ కోసం టీమిండియాలో హాట్ కాంపిటేషన్ ఉంది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌కు సెలక్టర్లు ప్రాధాన్యం ఇవ్వగా.. టీ20 ప్రపంచకప్ కోసం ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌లో జితేష్ శర్మను పరీక్షిస్తున్నారు. వన్డే సిరీస్‌లో సంజు శాంసన్ రాణిస్తే అతడు కూడా టీ20 ప్రపంచకప్ జట్టు కోసం పోటీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ తర్వాత ఈ జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా కలవనుంది.

అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వన్డే ప్రపంచకప్ తరహాలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌ను మాత్రమే ఎంపిక చేస్తారా లేదా టీ20 ప్రపంచకప్ కోసం కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ కొత్త వికెట్ కీపర్లకు ఛాన్స్ ఇస్తే రిషబ్ పంత్, సంజు శాంసన్‌ను తీసుకుంటారా అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వస్తే.. కేఎల్ రాహుల్‌ను టెస్టులు, వన్డేలకు పరిమితం చేస్తారని.. టీ20లకు ఇతర వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తారని కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అన్ని ఫార్మాట్లలోనూ తాను వికెట్ కీపర్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కేఎల్ రాహుల్ భావిస్తున్నాడని.. మిడిలార్డర్‌లో అతడి స్థానం భర్తీ చేయడం అంత సులభం కాదని అతడి అభిమానులు స్పష్టం చేస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T18:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising