ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL 2023: అయినా అదే తీరు.. స్వల్ప స్కోరుకే ఆర్సీబీ ఆలౌట్!

ABN, First Publish Date - 2023-03-10T21:24:53+05:30

నాలుగో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు తలరాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: నాలుగో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు తలరాత మారలేదు. బ్యాటింగ్‌లో మరోమారు బోల్తాపడింది. యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 138 పరుగులకే కుప్పకూలింది. బౌలర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తే తప్ప ఆర్సీబీ విజయం దాదాపు అసాధ్యం. మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిన యూపీ ముందు ఈ లక్ష్యం చిన్నదే అవుతుంది.

యూపీ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ దెబ్బకు బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. సోఫీ 4, దీప్తి 3 వికెట్లు తీసి బెంగళూరును కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆర్సీబీ జట్టులో ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్ మాత్రం బౌలర్లను ఎదురొడ్డి జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. పెర్రీ 39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, సోఫీ డివైన్ 24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 36 పరుగులు చేసింది. వారిద్దరూ క్రీజులో కాసేపైనా నిలవడం వల్లే ఆర్సీబీ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. 139 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు ఎలా కాపాడతారో చూడాల్సిందే.

Updated Date - 2023-03-10T21:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising