ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024 Retention: ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు వీళ్లే.. హార్దిక్ పాండ్యాపై క్లారిటీ వచ్చేసింది

ABN, First Publish Date - 2023-11-26T18:35:20+05:30

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతోంది? అసలు ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని వదులుకున్నారు? ఎవర్ని రిటైన్ చేసుకున్నారు?

IPL Retension: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతోంది? అసలు ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని వదులుకున్నారు? ఎవర్ని రిటైన్ చేసుకున్నారు? అనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఓ సంచలన రూమర్ బాగా వైరల్ అయ్యింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి రానున్నాడని, అందుకోసం ఆ ఫ్రాంచైజీ అతనికి ఏకంగా రూ.15 కోట్లు సమర్పించిందని ప్రచారం జరిగింది.

అంతేకాదు.. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకి నాయకత్వం వహించబోతున్నాడనే టాక్ నడిచింది. బహుశా రోహిత్ గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లొచ్చు? లేదా అతడు మొత్తానికే పక్కకు తప్పుకోవచ్చన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ.. అదంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్/రిలీజ్ ఆటగాళ్ల ప్రకటన కార్యక్రమంలో భాగంగా.. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వెళ్లడం లేదని, గుజరాత్ జట్టుకే కెప్టెన్సీ వహించనున్నట్టు వెల్లడైంది. అటు.. ముంబై ఇండియన్స్ సైతం రోహిత్ శర్మనే కెప్టెన్ అని స్పష్టం చేసింది.

అయితే.. పలు జట్ల మధ్య మాత్రం ఆటగాళ్లు ట్రేడింగ్ జరిగింది. కీలకమైన ఆటగాళ్లను కొన్ని జట్లు ఇచ్చుపుచ్చుకున్నాయి. ఇదే సమయంలో.. కొందరు ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అయితే ఏకంగా 11 ఆటగాళ్లని విడుదల చేసింది. ఇలా పలు జట్లు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా విడుదల చేశారు. ఈ ఆటగాళ్లకు సంబంధించిన ఐపీఎలం వేలం డిసెంబర్ 19వ తేదీన జరగనుంది.


ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని విడుదల చేశాయంటే?

* చెన్నై సూపర్‌ కింగ్స్‌: అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), ప్రిటోరియస్‌, జేమీసన్, బెన్‌ స్టోక్స్, భగత్‌ వర్మ, సేనాపతి, సిసింద మగల, ఆకాశ్‌ సింగ్‌.

* రాజస్థాన్‌ రాయల్స్: జో రూట్, అబ్దుల్ బసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిస్ఠ్‌, కుల్దిప్‌ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్‌, మురుగన్ అశ్విన్‌, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్‌

* దిల్లీ క్యాపిటల్స్‌: ముస్తాఫిజుర్‌, సాల్ట్, రోసోవ్‌, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీశ్‌ పాండే, కమ్లేష్ నాగర్‌కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్‌ గార్గ్‌.

* పంజాబ్ కింగ్స్‌: భానుక రాజపక్స, మోహిత్ రాథీ, అగద్‌ బవా, షారుఖ్‌ ఖాన్‌, బాల్తేజ్‌ ధందా

* సన్ రైజర్స్‌ హైదరాబాద్‌: హ్యారీ బ్రూక్, సమర్త్‌ వ్యాస్‌, కార్తిక్‌ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసేన్, అదిల్ రషీద్

* లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌: జయ్‌దేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్‌ వోహ్రా, స్వప్పిల్ సింగ్‌, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్‌ షేడ్జే, కరుణ్‌ నాయర్‌

* గుజరాత్‌ టైటాన్స్‌: యశ్‌ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, పరదీప్‌ సంగ్వాన్, ఓడియన్‌ స్మిత్, అల్జారీ జోసెఫ్‌, డాసున్ శనక

* ముంబయి ఇండియన్స్‌: మహమ్మద్ అర్షద్ ఖాన్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హృతిక్‌ షోకీన్, రాఘవ్‌ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్యూన్ జాన్‌సెన్, రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్, క్రిస్‌ జోర్డాన్, సందీప్‌ వారియర్

* రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ఫిన్‌ ఆలెన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డేవిడ్‌ విల్లే, వేన్‌ పార్నల్‌, సోనూ యాదవ్‌, అవినాష్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌

* కోల్‌కతా నైట్‌రైడర్స్‌: షకిబ్ అల్‌ హసన్, లిటన్ దాస్‌, ఆర్య దేశాయ్‌, డేవిడ్ వీజ్, నారాయణ్‌ జగదీశన్, మన్‌దీప్‌ సింగ్‌, కుల్వంత్ ఖజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, జాన్సన్ ఛార్లెస్‌

Updated Date - 2023-11-26T18:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising