Ashes Aeries: 40 ఏళ్ల వయసులో అండర్సన్ ఖాతాలో అదిరిపోయే రికార్డు
ABN, First Publish Date - 2023-06-19T10:43:57+05:30
యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 4 పదుల వయసులోనూ దుమ్ములేపుతున్న అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్ (Ashes Aeries) ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ ( James Anderson) చరిత్ర సృష్టించాడు. 4 పదుల వయసులోనూ దుమ్ములేపుతున్న అండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చడం ద్వారా అండర్సన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఆదివారం మొదటి సెషన్‌లో తన నాల్గో ఓవర్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న అలెక్స్ క్యారీ(66)ని క్లీన్ బౌల్డ్ చేసిన అండర్సన్.. ఆరో వికెట్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ పాట్నర్‌షిప్‌కు బ్రేక్ వేశాడు.
కాగా 2002లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 54 సార్లు 5 వికెట్ల హాల్స్, 6 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాలు 7/19. ఇక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి 2003లో అడుగుపెట్టిన అండర్సన్ ఇప్పటివరకు 180 మ్యాచ్‌లు ఆడి 686 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 32 సార్లు 5 వికెట్ల హాల్స్, 3 సార్లు 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాలు 7/42. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులో ఏ ఆటగాడైనా రిటైర్ అవుతాడు. కానీ అండర్సన్ మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉండి, ఫిట్‌నెస్ విషయంలో కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.
Updated Date - 2023-06-19T10:54:31+05:30 IST