CSK vs GT IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ సంచలన ఇన్నింగ్స్... టైటిల్ గెలవాలంటే చెన్నై లక్ష్యం ఎంతంటే..
ABN, First Publish Date - 2023-05-29T21:19:06+05:30
ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది.
అహ్మదాబాద్: ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 214 పరుగులు చేసింది. దీంతో మహేంద్ర సింగ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను ముద్దాడాలంటే లక్ష్యం 215 పరుగులుగా ఉంది.
గుజరాత్ ఇంత భారీ స్కోరు చేయడంలో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ కీలకమైంది. చెన్నై బౌలర్లు అందరినీ సుదర్శన్ ఉతికి ఆరేశాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. మైదానం అన్ని మూలలా ఈ యువ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడాడు. అయితే సెంచరీకి 4 పరుగుల దూరంలో మహీష్ పథీరన బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్లలో వృద్ధిమాన్ సాహా (54), శుభ్‌మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (96), హార్ధిక్ పాండ్యా (21 నాటౌట్), రషీద్ ఖాన్ (0) చొప్పున పరుగులు చేశారు.
ఇక చెన్నై బౌలర్లలో మహీశ పథీరన 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశఆరు. కాగా దేశ్‌పాండే అందరికంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్లు వేసి ఏకంగా 56 పరుగులు ఇచ్చారు.
Updated Date - 2023-05-29T21:38:57+05:30 IST