India vs Australia 2nd Test: పెవిలియన్ బాటపట్టిన టాప్ ఆర్డర్..కష్టాల్లో టీమిండియా..
ABN, First Publish Date - 2023-02-18T11:30:15+05:30
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమిండియా జట్టు(Team India) పీకల్లోతూ కష్టాల్లో..
India vs Australia 2nd Test: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమిండియా జట్టు(Team India) పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా(Australia) బౌలర్లు విజృంభిస్తుండటంతో 60 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ 21-0తో ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలో గట్టిషాక్ తగిలింది. ఈసారైనా తన సత్తాచాటుతాడనుకున్న రాహుల్ (17) మరోసారి నిరాశపరిచాడు. నాథన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) (32) నాథన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత్ 53 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. టెస్టు కెరీర్(Test career)లో 100వ టెస్టు ఆడుతున్న పుజారా కూడా నిరాశపరిచాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు. గాయంతో తొలి టెస్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో టీమిండియా 66 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 74/4 ఉండగా..క్రీజులో విరాట్ కోహ్లీ (12), రవీంద్ర జడేజా (3) క్రీజులో కొనసాగుతున్నారు.ఇంకా టీమిండియా జట్టు 189 వెనుకబడి ఉంది.
Updated Date - 2023-02-18T11:35:03+05:30 IST