Indiavs Sri Lanka 3rd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. ఏం ఎంచుకుందంటే..
ABN, First Publish Date - 2023-01-07T18:42:38+05:30
భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) టీ20 సిరీస్‌లో (T20 Series) నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో టాస్ పడింది.
రాజ్‌కోట్: భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) టీ20 సిరీస్‌లో (T20 Series) నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి శ్రీలంకను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు మంచి ట్రాక్‌లా కనిపిస్తోందని, రాత్రి సమయంలో బంతి నుంచి స్వింగ్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. కాగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో నేటి మ్యాచ్ ఫలితం సిరీస్‌ను నిర్ణయించనుంది.
ఇండియా ప్లేయింగ్:
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్.
శ్రీలంక ప్లేయింగ్
పతుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, ధనంజయ డీసిల్వా, చరిత అసలంక, దసున్ షణక(కెప్టెన్), వణిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక.
Updated Date - 2023-01-07T18:48:50+05:30 IST