ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Korea Open: గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టిన తెలుగు ఆటగాడు

ABN, First Publish Date - 2023-07-18T21:47:23+05:30

కొరియా ఓపెన్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్‌కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల జోడీతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌ పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు.

కొరియా ఓపెన్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్‌కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల జోడీతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌ పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సాత్విక్ గంట‌కు ఏకంగా 565 కి.మీ వేగంతో స్మాష్ హిట్ కొట్టాడు. దీంతో పరుషుల బ్యాడ్మింటన్‌లో అత్యంత వేగంతో కొట్టిన స్మాష్ హిట్‌గా ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ క్రమంలో గతంలో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ పేరు మీద ఉన్న పదేళ్ల రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. 2013 మేలో టాన్ బూన్ హియోంగ్ గంటకు 493 కిలో మీటర్ల వేగంతో హిట్ కొట్టాడు. ఇది అప్పట్లో గిన్నిస్ రికార్డులకెక్కింది. పదేళ్ల పాటు హియోంగ్ పేరు మీదనే ఈ రికార్డు ఉంది. తాజాగా అమలాపురం ఆటగాడు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.


కాగా సాధారణంగా అత్యంత వేగంతో దూసుకుపోయే ఒక ఫార్ములా వన్ కారు గరిష్ట వేగమే 372.6 కిలో మీటర్లుగా ఉంటుంది. కానీ అదే సాత్విక్ కొట్టిన షాట్ వేగం అంతకంటే 193 కిలో మీటర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక మహిళల బ్యాడ్మింటన్‌లో ఈ రికార్డు మలేషియాకు చెందిన టాన్ పియర్లీ పేరు మీద ఉంది. ఆమె గంటకు ఏకంగా 438 కి.మీ. వేగంతో ఓ షాట్ కొట్టింది. కాగా ప్రస్తుతం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాత్విక్‌సాయిరాజ్ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో గల అమలాపురంలో జన్మించాడు. ఇక ఈ బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ సూపర్ 500 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సాత్విక్- చిరాగ్ జోడి తమ ప్రారంభ రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్‌కోహ్, కిట్టినుపాంగ్‌ జంటపై విజయం సాధించి ఫ్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 32 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడి 21-16, 21-14తో గెలిచింది. ఈ విజయంతో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌లు తమ ర్యాంకులను కూడా మెరుగుపరచుకున్నారు. కాగా గత నెలలో ముగిసిన ఇండోనేషియా ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ జంట సెమీ ఫైనల్ వరకు చేరుకుంది.

Updated Date - 2023-07-18T22:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising