ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MIvsRCB: 20వ ఓవర్‌లో ముంబై ఏం కట్టడి చేసింది గురూ.. ఆర్‌సీబీ 200 స్కోర్ చేస్తుందనుకుంటే..

ABN, First Publish Date - 2023-05-09T21:49:53+05:30

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ (RCBvsMI) ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ (RCBvsMI) ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించి ముంబై ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 20వ ఓవర్‌లో ఆర్‌సీబీని ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా కట్టడి చేసింది. 20వ ఓవర్ బౌలింగ్ చేసిన ముంబై బౌలర్ ఆకాష్ మాధ్వల్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఔరా అనిపించాడు. 20వ ఓవర్‌ బౌలింగ్ 0,1,2,1,1,1 ఇలా సాగింది. 20వ ఓవర్లో వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు బ్యాటింగ్ చేస్తున్న ఏ జట్టైనా ప్రయత్నించడం సహజం. కానీ.. బౌలర్ కట్టడి చేస్తే పరుగులు సాధించడం ఎంత కష్టమో ఆకాష్ మాధ్వల్ బౌలింగ్ కళ్లకు కట్టింది. 199 పరుగులు తక్కువ స్కోర్ ఏం కానప్పటికీ ఆర్‌సీబీకి మరిన్ని పరుగులు రాబట్టే అవకాశాన్ని ఆకాష్ మాధ్వల్ ఇవ్వలేదని చెప్పొచ్చు.

ఇక.. ఓవరాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను తొలి ఓవర్‌లోనే ఆర్‌సీబీ కోల్పోయింది. అయితే.. మరో ఓపెనర్, బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ 41 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగాడు. అయితే.. కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో విష్ణు వినోద్‌కు క్యాచ్‌గా దొరికిపోవడంతో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు.

డుప్లెసిస్ మాత్రమే కాదు మ్యాక్స్‌వెల్ కూడా ఈ మ్యాచ్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. 33 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో 68 పరుగులు సాధించి మ్యాక్స్‌వెల్ మార్క్ ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు. దినేష్ కార్తీక్ కూడా 18 బంతుల్లో 30 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి ఔట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా చూసుకుంటే.. ముంబై తరపున డెబ్యూ మ్యాచ్ ఆడిన జోర్డాన్ 4 ఓవర్లకు ఒక వికెట్ తీసి 48 పరుగుల భారీ స్కోర్‌ను సమర్పించుకున్నాడు. పీయూష్ చావ్లా బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 41 పరుగులను ఆర్‌సీబీ రాబట్టగలిగింది. ఆకాష్ మధ్వాల్ రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్‌లో 17 పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండో ఓవర్‌లో కేవలం 6 పరుగులకే ఆర్‌సీబీ బ్యాటర్లను కట్టడి చేయడం గమనార్హం. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్స్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

Updated Date - 2023-05-09T21:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising