ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRHvsMI: మంచి స్కోరే చేసిన ముంబై ఇండియన్స్.. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు కుమ్మేస్తారో.. కూలబడిపోతారో..!

ABN, First Publish Date - 2023-04-18T21:34:59+05:30

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Hyderabad Uppal Stadium) వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (MIvsSRH) ఐపీఎల్ మ్యాచ్‌లో (IPL 2023) ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ (Mumbai Indians Batting) చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కేమెరూన్ గ్రీన్ (Cameron Green) 40 బంతుల్లో 64 పరుగులు చేసి రాణించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) 18 బంతుల్లో 28 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో మర్క్రమ్‌కు (Markram) క్యాచ్‌గా దొరికిపోయాడు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 31 బంతుల్లో 38 పరుగులు చేసి జాన్‌సెన్ బౌలింగ్‌లో మర్క్రమ్‌కే క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపించినప్పటికీ మళ్లీ నిరాశపరిచాడు. 3 బంతుల్లో 7 పరుగులు (ఒక సిక్స్) చేసి మర్క్రమ్‌కు క్యాచ్‌గా దొరికి ఔట్‌గా వెనుదిరిగాడు.

అయితే.. తిలక్ వర్మ (Tilak Varma), కేమెరూన్ గ్రీన్ (Cameron Green) .. ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు (Mumbai Indians) భారీ స్కోర్‌ను అందించారు. తిలక్ వర్మ 17 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో చెలరేగి 37 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ భువనేశ్వర్ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌గా దొరికి ఔట్ కావడం గమనార్హం. గ్రీన్ మాత్రం చివరి బంతి వరకూ నిలకడగా ఆడి 40 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ముంబై జట్టు 192 పరుగులు చేయడంలో గ్రీన్ (64) కీలక పాత్ర పోషించాడు.

ఇక.. సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) బౌలర్ల విషయానికొస్తే.. నటరాజన్ (Natarajan SRH) ఒక వికెట్ తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ బౌలింగ్ చేసిన నాలుగు ఓవర్లలో ముంబై బ్యాటర్లు 50 పరుగులు సాధించారు. జాన్‌సెన్ రెండు వికెట్లు తీసినప్పటికీ 43 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులు, మయాంక్ మార్కండే ఓవర్లలో 35 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 33 పరుగులు రావడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే.. సన్‌రైజర్స్ బౌలర్లు పరుగులను కట్టడి చేసే విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలనేది ఈ మ్యాచ్‌తో స్పష్టమైంది.

సన్‌రైజర్స్ కెప్టెన్ మర్క్రమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందు నిలిపింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి, బ్రూక్, మర్క్రమ్ ఆట తీరు కీలకం కానుంది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఈ ముగ్గురూ పరుగుల వరద పారించక తప్పదు. ఎస్‌ఆర్‌‌హెచ్ బ్యాటర్లు కుమ్మేస్తారో.. కూలబడిపోతారో చూడాలి.

Updated Date - 2023-04-18T21:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising