IPL Cup: శ్రీనివాసుడి సన్నిధిలో ఐపీఎల్ కప్
ABN, First Publish Date - 2023-05-31T12:52:16+05:30
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పోటీల్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) సాధించిన కప్‌ను ఆ జట్టు యాజమాన్యం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పోటీల్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) సాధించిన కప్‌ను ఆ జట్టు యాజమాన్యం మంగళవారం స్థానిక టి.నగర్‌లోని వెంకటేశ్వరస్వామి(Venkateswara Swamy) ఆలయంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించింది. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో గుజరాత్ జట్టుపై సీఎ్‌సకే విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎ్‌సకే జట్టు ఐపీఎల్ కప్ సాధించడం ఇది ఐదోమారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన ప్రతిసారీ ఆ జట్టు యాజమాన్యం కప్‌ను స్వామివారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సీఎస్కే యజమాని శ్రీనివాసన్ నేతృత్వంలోని బృందం మంగళవారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి చెన్నై చేరుకోగానే విమానాశ్రయం నుంచి నేరుగా కప్‌తో శ్రీవారి ఆలయానికి చేరుకుంది. వారికి టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్, మాజీ అధ్యక్షుడు నూతలపాటి శ్రీకృష్ణ, సభ్యులు పీవీఆర్ కృష్ణారావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కప్‌ను స్వామివారి సన్నిధిలో పెట్టి, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2023-05-31T12:52:16+05:30 IST