IPL: ఐపీఎల్‌ టిక్కెట్లకు పోటెత్తిన అభిమానులు

ABN, First Publish Date - 2023-05-04T09:17:35+05:30

చేపాక్‌ స్టేడియంలో ఈ నెల ఆరున జరుగనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబాయి ఇండియన్స్‌(Chennai Super Kings, Mumbai Indians) జట్ల

IPL: ఐపీఎల్‌ టిక్కెట్లకు పోటెత్తిన అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కౌంటర్ల వద్ద తొక్కిసలాట

- స్వల్ప లాఠీఛార్జి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక చేపాక్‌ స్టేడియంలో ఈ నెల ఆరున జరుగనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబాయి ఇండియన్స్‌(Chennai Super Kings, Mumbai Indians) జట్ల మధ్య జరుగనున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయం బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ టికెట్లను కొనటానికి క్రీడాభిమానులు మంగళ వారం రాత్రి పది గంటల నుండి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన రెండు కౌంటర్ల వద్ద బారులు తీరారు. పలువురు నేలపై పడుకున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రెండు కౌంటర్లలో టికెట్ల విక్రయం ప్రారంభం కాగానే అభిమానుల మధ్య తొక్కిసలాట ప్రారంభమైంది. దీనితో ఆ ప్రాంతంలో కాపలా కాస్తున్న స్థానిక పోలీసులు వారిని అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీఛార్జి కూడా జరిపారు. ఈ టికెట్లను కొనటానికి సుమారు ఏడువేలమంది దాకా రావటంతో స్టేడియం చుట్టూ ఎటూ చూసినా క్రీడాభిమానులే కనిపించారు. వీరిని వరుసగా క్యూలైన్లలో నిలువమంటూ పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినా టికెట్లను కొనడానికి ఎగబడ్డారు. దీనితో టికెట్ల అమ్మకాన్ని 11.30 గంటల వరకు నిలిపి వేశారు. ఆ తర్వాత పోలీసులు అందరినీ క్యూలోన్లలో నిలబెట్టాక టికెట్ల విక్రయం సాఫీగా జరిగింది. ఈ టికెట్లను కొనేందుకు మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేశారు. అయితే మూడు గంటలపాటు టికెట్ల అమ్మకం నిలిపివేయడంతో వీరిలో ముగ్గురు మహిళలు మూర్చిల్లారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

nani5.2.jpg

Updated Date - 2023-05-04T09:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising