ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jasprit Bumrah: బుమ్రా ఆగయా.. వచ్చే నెలలోనే బరిలోకి దిగనున్న పేస్ గన్!

ABN, First Publish Date - 2023-06-28T12:45:50+05:30

భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు (Odi World Cup) మంగళవారమే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఓ శుభవార్త. టీమిండియా (Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో వేగంగా కోలుకుంటున్నాడు. వచ్చే నెలలో ఎన్సీఏలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నాడని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు (Odi World Cup) మంగళవారమే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఓ శుభవార్త. టీమిండియా (Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో వేగంగా కోలుకుంటున్నాడు. వచ్చే నెలలో ఎన్సీఏలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నాడని సమాచారం.

ప్రస్తుతం ఎన్సీఏలో బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడని, నెట్స్‌లో ప్రతిరోజూ 7 ఓవర్లపాటు బౌలింగ్ చేస్తున్నడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy) జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బుమ్రా ఆడనున్నాడట. ఆ ప్రాక్టీస్ మ్యాచ్‌ల అనంతరం బుమ్రా ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నారు. దీనిని బట్టి ఆగష్టులో జరిగే ఆసియా కప్‌లో (Asia Cup) బుమ్రా ఆడే అవకాశాలున్నాయి. అదే జరిగితే టీమిండియా బౌలింగ్ బలం పెరగనుంది. కాగా రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాలో బుమ్రా కీలకపాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు అంచనా వేస్తున్నారు.

కాగా జనవరిలో శ్రీలంకతో (Sri Lanka) జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా నెట్స్‌లో శ్రమిస్తూ బుమ్రా గాయపడ్డాడు. వెన్ను నొప్పితో అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు మార్చి నెలలో న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. కాగా గాయాలతో టీమిండియాకు దూరమైన కేఎల్ రాహుల్ (KL Rahul), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కూడా బుమ్రాతోపాటే ఎన్సీఏలో కోలుకుంటున్నారు.

Updated Date - 2023-06-28T12:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising