SRHvsLSG: సన్‌రైజర్స్‌కు ఏమైందో.. ఏంటో.. ఇంత తక్కువ స్కోరా..!
ABN, First Publish Date - 2023-04-07T21:46:49+05:30
లక్నో వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి..
లక్నో వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. 122 పరుగులు స్వల్ప లక్ష్యం మాత్రమే లక్నో ముందు హైదరాబాద్ నిలిపింది. హైదరాబాద్ బ్యాటర్లలో అన్మోల్ ప్రీత్ సింగ్ (31) పరుగులు, రాహుల్ త్రిపాఠి (35) పరుగులు తప్ప మిగిలిన ఏ ఒక్కరూ చెప్పుకోతగిన ఆటతీరు కనబర్చలేదు. భారీ ఆశలు పెట్టుకున్న మర్క్రమ్, ఐపీఎల్‌లో భారీగా పెట్టి కొన్న బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచారు.
లక్నో బౌలర్ క్రూనల్ పాండ్యా బౌలింగ్‌లో హైదరాబాద్ కెప్టెన్ మర్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. బ్రూక్ కూడా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వికెట్ కీపర్ పూరన్ స్టంపౌట్ చేయడంతో పెవిలియన్ బాట పట్టాడు. క్రూనల్ పాండ్యా తన స్పిన్‌తో మాయాజాలం చేసి హైదరాబాద్‌ను చావు దెబ్బ తీశాడు. క్రూనల్ తన కోటా నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లను పడగొట్టి హైదరాబాద్‌ను పెద్ద దెబ్బ కొట్టాడు. మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా 4 ఓవర్లకు 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో వికెట్ తీశారు.
మొత్తంగా చెప్పాలంటే.. లక్నో స్పిన్నర్లు హైదరాబాద్‌ను 121 పరుగులకే నిలువరించారు. బౌలింగ్ పిచ్ అని చెబుతున్నప్పటికీ మరీ ఇంత తక్కువ టార్గెట్ పెట్టడం ఏంటని సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్‌రైజర్స్ యాజమాన్యంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. టీంను ఇలాగేనా ఎంపిక చేసేదని, కీలక ఆటగాళ్లను వదిలేసుకున్నారని కావ్య మారన్‌పై కూడా సన్‌రైజర్స్ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు.
మొదటి మ్యాచ్‌లో మర్క్రమ్ లేడని, వచ్చాక చూసుకుందామని చెప్పిన సన్‌రైజర్స్ అభిమానులకు మర్క్రమ్ డకౌట్ అవ్వడం చూశాక గుండె పగిలినంత పనయింది. హైదరాబాద్ బౌలర్లపైనే అభిమానులు భారం వేశారు. కానీ.. స్వల్ప టార్గెట్ కావడం మూలాన విజయావకాశాలు ఎక్కువగా లక్నోకే ఉన్నాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
Updated Date - 2023-04-07T21:47:08+05:30 IST