Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా? సంచలనం సృష్టిస్తున్న ట్వీట్!
ABN, Publish Date - Dec 25 , 2023 | 03:52 PM
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే పలు రకాల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం పెద్ద చర్చనీయాంశం అయింది.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభానికి ముందే పలు రకాల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) మారడం పెద్ద చర్చనీయాంశం అయింది. 2022 సీజన్‌లో ట్రోఫీ అందించి, 2023 సీజన్‌లో ఫైనల్ చేర్చిన కెప్టెన్ హార్దిక్‌ను గుజరాత్ (Gujarat Titans) ఎందుకు వదులుకుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయిపోయింది. గుజరాత్ నుంచి హార్దిక్ ముంబైకి మారడం వెనుక పెద్ద ట్రేడింగ్ జరిగిందనే టాక్ బయటకు వచ్చింది.
తరచుగా క్రికెట్ విశేషాలను షేర్ చేసే @mufaddal_vohra అనే ట్విటర్ హ్యాండిల్‌లో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది (Viral Tweet). హార్దిక్ కోసం గుజరాత్‌కు ముంబై ఏకంగా రూ.100 కోట్లు (Rs.100 crores) చెల్లించిందనేది ఆ ట్వీట్ సారాంశం. ముంబై అంత భారీ మొత్తం చెల్లించడం వల్లే కెప్టెన్ అయిన హార్దిక్‌ను గుజరాత్ వదులుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 5.6 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. హార్దిక్ కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ముంబైకి లేదని కొందరు అంటున్నారు. మరోవైపు హార్ధిక్ బంగారు బాతు లాంటివాడని, అతడి కోసం ఎంత ఖర్చు పెట్టినా పైసా వసూల్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హార్దిక్ ఐపీఎల్-2024 ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేలా లేడు.
Updated Date - Dec 25 , 2023 | 03:52 PM