లక్నోపై ముంబై ఘనవిజయం.. శుక్రవారం క్వాలిఫయర్-2లో గుజరాత్‌తో ఢీ...
ABN, First Publish Date - 2023-05-24T23:46:20+05:30
ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
చెన్నై: ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ముంబై నిర్దేశించిన 182 పరుగుల లక్ష్య చేధనలో లక్నో బ్యాటర్లు చతికిలపడ్డారు. 16.3 ఓటర్లలో కేవలం 101 పరుగుల మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వల్ చెలరేగాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. లక్నోని కోలుకోలేని దెబ్బతీసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ తీశారు. మూడు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోనియిస్ చేసిన 40 పరుగులే టాప్ స్కోర్‌గా ఉన్నాయి. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాడు. కాగా ముంబై ఈ గెలుపుతో క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది.శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
Updated Date - 2023-05-24T23:47:52+05:30 IST