Asian Games: స్వర్ణం కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. రజతంతో సత్తా చాటిన కిశోర్
ABN, First Publish Date - 2023-10-04T19:29:40+05:30
చైనాలోని హాంగ్జౌ(Hangzhou) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో - 2023(Asian Games - 2023) ఇండియన్ క్రీడాకారులు.. సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు దేశం తరఫున సాధించిన పతకాల సంఖ్య 80కి చేరుకుంది.
చైనా: చైనాలోని హాంగ్జౌ(Hangzhou) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో - 2023(Asian Games - 2023) ఇండియన్ క్రీడాకారులు.. సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు దేశం తరఫున సాధించిన పతకాల సంఖ్య 80కి చేరుకుంది. ఇవాళ జరిగిన జావెలిన్ త్రోలో ఒలింపియన్ ఛాంప్ నీరజ్ చోప్రా(Javelin thrower Neeraj Chopra) స్వర్ణ పతకం(Gold Medal) సాధించాడు.
88.88 మీటర్ల దూరం ఈటను విసరి పసిడి కైవసం(Silver Medal) చేసుకున్నాడు. ఇదే ఈవెంట్ లో జావెలిన్ త్రోయర్ కిశోర్ కుమార్(Kishore Kumar) సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అతను 87.54 మీటర్ల దూరం వరకు ఈటను విసిరి రెండో స్థానంలో నిలిచాడు. జపాన్ (Japan)కు చెందిన డీన్ రొడెరిక్ అయిదో ట్రైలో 82.68 మీటర్ల దూరం ఈటను విసిరి మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. 3 నిమిషాల 01:58 సెకన్లలో భారత బృందం లక్ష్యాన్ని చేరుకుని టాప్ పొజీషన్ లో నిలిచింది. ఇలా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండుతోంది.
Updated Date - 2023-10-04T19:29:40+05:30 IST