WFI Sexual Harassment Case: న్యాయం చేయాలి...రెజ్లర్లకు నీరజ్ చోప్రా మద్ధతు
ABN, First Publish Date - 2023-04-28T10:27:41+05:30
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య కోసం...
న్యూఢిల్లీ :రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య కోసం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్లకు ఒలింపిక్ బంగారు పతక విజేత, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మద్ధతు ప్రకటించారు.(Neeraj Chopra)లైంగిక వేధింపులపై (WFI Sexual Harassment Case)పారదర్శకంగా దర్యాప్తు జరిపి,డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని నీరజ్ చోప్రా డిమాండ్ చేశారు.నీరజ్ చోప్రా తన సోషల్ మీడియా ఖాతాలో భజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లకు(Protesting Wrestlers) మద్దతు ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘‘మా అథ్లెట్లు న్యాయం కోరుతూ వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగించింది. వారు మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, మనల్ని గర్వపడేలా చేయడానికి చాలా కష్టపడ్డారు. ఒక దేశంగా, ప్రతి వ్యక్తి యొక్క సమగ్రత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాది’’అని నీరజ్ చోప్రా ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ప్రస్థుతం జరుగుతున్నది ఎప్పుడూ జరగకూడదు. ఇది సున్నితమైన సమస్య, పారదర్శకంగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి’’ అని నీరజ్ చోప్రా కోరారు.అభినవ్ బింద్రా కూడా రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు.
ఇది కూడా చదవండి : Bihar: జేడీ(యూ) సీనియర్ కైలాష్ మహతోను ఆగంతకులు కాల్చి చంపారు...
అంతకుముందు, మరో భారత ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా కూడా అథ్లెట్లకు తన సంఘీభావం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘అథ్లెట్లుగా అంతర్జాతీయ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మేం ప్రతిరోజూ కష్టపడి శిక్షణ తీసుకుంటాం. భారత రెజ్లింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో వేధింపుల ఆరోపణలకు సంబంధించి మా అథ్లెట్లు వీధుల్లో నిరసన తెలపడం చాలా బాధాకరం’’ అని బింద్రా ట్వీట్ చేశారు.రెజ్లర్ల ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. బ్రిజ్ భూషణ్‌పై కేసు దాఖలు చేయడానికి ముందు ఈ విషయంపై ప్రాథమిక విచారణ అవసరమని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
Updated Date - 2023-04-28T10:41:29+05:30 IST