ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షా, అతడి స్నేహితుడిపై దాడి.. ఈ ఘటనలో ట్విస్ట్

ABN, First Publish Date - 2023-02-16T16:57:50+05:30

క్రికెటర్ పృద్వీ షా (Prithvi Shaw), అతడి స్నేహితుడిపై ముంబైలో దాడి జరిగింది. పృద్వీ షా కూర్చొని ఉన్న కారు అద్దాలను బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. సెల్ఫీ అడిగితే నిరాకరించడమే ఈ దాడికి కారణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), అతడి స్నేహితుడిపై ముంబైలో దాడి జరిగింది. పృథ్వీ షా కూర్చొని ఉన్న కారు అద్దాలను బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. సెల్ఫీ అడిగితే నిరాకరించడమే ఈ దాడికి కారణమైంది. పృథ్వీ షా, తన ఫ్రెండ్‌ ఆశిష్ సురేంద్ర (Ashish Surendra) డిన్నర్ చేసేందుకు ఫిబ్రవరి 15న (బుధవారం) ముంబైలోని ఓ ఫైవ్-స్టార్ హోటల్‌కు వెళ్లారు. అయితే క్రికెటర్ గుర్తించిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. పృథ్వీ షా నిరాకరించడంతో నిందితులు ఇద్దరూ వెళ్లి మరికొందరిని వెంటబెట్టుకొని వచ్చారు. సెల్ఫీ ఇవ్వాలని మళ్లీ పట్టుబడ్డారు. దీంతో విసుగుచెందిన పృథ్వీ షా ఇక్కడికి డిన్నర్ చేయడానికి వచ్చానని, ఇబ్బంది పెట్టొద్దని సూచించాడు. ఎంతకీ మాట వినకపోవడంతో విషయాన్ని హోటల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న మేనేజర్‌ నిందిత వ్యక్తులను హోటల్ నుంచి బయటకు పంపించివేశారు.

దీంతో అవమానంగా భావించిన నిందితులు పృథ్వీ షా, అతడి ఫ్రెండ్ రాకకోసం హోటల్ బయటే వేచిచూశారు. వీరిద్దరూ బయటకు వచ్చిన వెంటనే దాడికి దిగారు. స్నేహితుడి బీఎండబ్ల్యూ కారులో పృథ్వీ షా కూర్చొని ఉండగానే నిందిత వ్యక్తులు దాడి చేశారు. బేస్‌బాల్ బ్యాట్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో మరో కారులో పృథ్వీ షాను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ నిందితులు కారును వెంబడించారు. అప్పటికే ఓ పెట్రోల్ బంక్ వద్ద వేచిచూస్తున్న కొందరు మహిళల గ్యాంగ్ పృథ్వీ షాను బెదిరించారు. ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసేందుకు రూ.50 వేలు ఇవ్వాలని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని భయపెట్టారు. ఇదే విషయాన్ని పృథ్వీ షా స్నేహితుడు ఆశీష్ సురేంద్ర.. ఒషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశామని, హోటల్‌లో సెల్ఫీల ఆధారంగా ఇద్దరిని గుర్తించినట్టు వెల్లడించారు.

పృథ్వీ షా వేధించాడు..

ముంబైలో పృథ్వీ షాపై దాడిలో ట్విస్ట్ వెలుగుచూసింది. పృథ్వీ, అతడి స్నేహితులు తనను శారీరకంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన సప్నా గిల్ ఈ ఆరోపణలు చేసింది. చేతిలో కర్ర పట్టుకొని తనను వేధించారని తెలిపింది. కాగా మెడికల్ టెస్టుల కోసం వెళ్లేందుకు సప్నాను పోలీసులు అనుమతించలేదని ఆమె లాయర్ అలీ కషిఫ్ ఖాన్ చెప్పారు. చివరికి ఈ కేసులో ఏం తేలుతుందో వేచిచూడాలి. కాగా జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ తర్వాత పృథ్వీ షా విరామం తీసుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఈ ముంబై కెప్టెన్ 6 మ్యాచుల్లో ఏకంగా 695 పరుగులు బాదాడు. దీంతో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

Updated Date - 2023-02-16T17:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising