ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sania Mirza: సానియా మీర్జా కంటతడి.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-03-05T13:55:12+05:30

ఇటివలే టెన్నీస్ కెరియర్‌కు వీడ్కోలు పలికిన భారతీయ టెన్సీస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) కోరిక మేరకు స్వస్థలం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ మ్యాచ్ (Sania Mirza) ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: జనవరిలో టెన్నిస్ కెరియర్‌కు వీడ్కోలు పలికిన భారతీయ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) కోరిక మేరకు స్వస్థలం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ మ్యాచ్ (Sania Mirza) ముగిసింది. తాను ఓనమాలు నేర్చుకొన్న ఎల్బీ స్టేడియంలో స్థానిక అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య వీడ్కోలు మ్యాచ్‌లో హూషారుగా ఆడింది. కాగా మ్యాచ్ పూర్తయిన తర్వాత సానియా మీర్జా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. కంటతడి పెట్టింది. కాగా ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌లో గతంలో తాను జోడీ కట్టిన గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్లు రోహన్‌ బోపన్న, ఇవాన్‌ డోడిగ్‌, మాటెక్‌ శాండ్స్‌, కారా బ్లాక్‌, మరియన్‌ బర్తోలీలతో సానియా పోటీపడింది. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించింది.

కాగా సానియాకు చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు. చప్పట్లు, కేరింతలతో సానియాను ఉత్సాహపరించారు. సినీ హీరో దుల్కర్ సల్మాన్‌తోపాటు పలువురు ప్రముఖలు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. కాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో సానియా మీర్జా ఫేర్‌వెల్‌కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఇందులో పలువురు ప్రముఖలు పాల్గొనబోతున్నట్టు సమాచారం.

ఇక భవిష్యత్‌ తరాన్ని తీర్చిదిద్దేందుకే నా సమయం..

ఫేర్‌వెల్ మ్యాచ్‌కు సానియా మీర్జా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. బ్యాడ్మింటన్‌ తరహాలో టెన్ని్‌సలోనూ సమర్థమైన వ్యవస్థ నిర్మితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇక భవిష్యత్‌ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తానని ఆమె చెప్పింది. ‘వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పాలనలో భాగస్వామిని కావాలనుకొంటున్నా. సినిమా రంగంవైపు అడుగులు వేయాలని అనుకోలేదు. బాలీవుడ్‌ అవకాశం వచ్చినా తిరస్కరించాన’ని మీర్జా వెల్లడించింది. తన కుమారుడు ఇజాన్‌కు బ్యాడ్మింటన్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వింబుల్డన్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప నెగ్గి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు లభించిన అపూర్వ స్వాగతం తన జీవితంలో మరువలేని ఘట్టమని వివరించింది. ‘సొంతగడ్డపై నన్ను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌ మధ్య తుది మ్యాచ్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని ఎంతోగానో కోరుకొన్నా. గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మొదలెట్టిన చోటికి వచ్చాన’ని సానియా చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-05T15:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising