Cricketer Shikhar Dhawan:శిఖర్ ధావన్ 15 ఏళ్ల వయసులో హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నాడు...ఎందుకంటే...
ABN, First Publish Date - 2023-03-27T12:21:13+05:30
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తన బాల్య దశలో జరిగిన సంచలన విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు....
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తన బాల్య దశలో జరిగిన సంచలన విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.(Cricketer Shikhar Dhawan) శిఖర్ ధావన్ ఓపెనర్‌గా గొప్ప ప్రదర్శన ఇవ్వడమే కాకుండా, మైదానం వెలుపల కూడా పేరుగాంచాడు. ధావన్ మీసాలు,తొడలు కొట్టడం, హెయిర్‌స్టైల్,ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో ప్రత్యేక స్థానం సంపాదించారు.ధావన్ తన శరీరంపై వివిధ రకాలు పచ్చబొట్లు కనిపిస్తుంటాయి. ధావన్ 15 ఏళ్ల వయసులో వేయించుకున్న టాటూ, అనంతరం ఎదురైన గమ్మతైన పరిస్థితి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘నాకు 15 సంవత్సరాల వయసులో ఉన్నపుడు...నేను మనాలీకి వెళ్లి(After Manali Trip) నా కుటుంబసభ్యులకు తెలియజేయకుండా నా వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాను. ఆ పచ్చబొట్టును 4 నెలలపాటు దాచాల్సి వచ్చింది. టాటూ గురించి నా తండ్రికి తెలిసి ఆయన నన్ను కొట్టాడు...పచ్చబొట్టు వేయించుకున్నాక భయపడి నేను ఆసుపత్రికి వెళ్లి హెచ్ఐవి టెస్టు(Took HIV Test) చేయించుకున్నాను.ఆ టెస్టులో ఫలితం నెగెటివ్ అని వచ్చింది’’ అని శిఖర్ ధావన్ నవ్వుతూ చెప్పారు.
ఇది కూడా చదవండి : Disqualification of Rahul Gandhi:పార్లమెంటులో నల్ల వస్త్రాలు ధరించి కాంగ్రెస్ ఎంపీల నిరసన
నా వీపుపై మొదటిసారి స్కార్పియో వేయించుకున్నానని ఆయన చెప్పారు. అనంతరం నా చేతిలో శివుడి టాటూ, అర్జున్ టాటూ కూడా వేయించుకున్నానని ధావన్ తెలిపారు.ధావన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఆడనున్నారు.
Updated Date - 2023-03-27T13:47:48+05:30 IST