ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRHvsMI: ఉప్పల్‌లో రసవత్తర ఐపీఎల్ పోరు.. టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

ABN, First Publish Date - 2023-04-18T19:18:51+05:30

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు వేదికైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఐపీఎల్‌లో (IPL 2023) మరో కీలక పోరుకు వేదికైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల (SRHvsMI) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ఈ మ్యాచ్‌లో తొలుత ముంబై జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇరు జట్ల అభిమానులు.. మరీ ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు స్టేడియంకు భారీగా వెళ్లారు. ఇక.. ఈ ఐపీఎల్-16 సీజన్‌లో ఈ రెండు జట్ల గెలుపోటములను ఒకసారి పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ జట్టు ఇప్పటివరకూ 4 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడి రెండు గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు కూడా 4 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడి రెండు మ్యాచ్‌లు గెలవడం గమనార్హం. ఇరు జట్ల రన్‌రేట్ మైనస్‌ల్లో ఉండటం కారణంగా ముంబై జట్టు 8వ స్థానంలో, హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉన్నాయి

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మర్క్రమ్(కెప్టెన్), క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కేమెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

ఇదిలా ఉండగా.. ఐపీల్ మ్యాచ్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ వరకూ 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెహిదీపట్నం, హయత్‌నగర్, ఎన్‌జీవోస్ కాలనీ, కోఠి, అప్జల్‌గంజ్, లక్డీకపూల్, జీడిమెట్ల, కొండాపూర్, బీహెచ్‌ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకూ ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-04-18T19:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising