ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Year End 2023: ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే..?

ABN, Publish Date - Dec 25 , 2023 | 07:25 PM

Sports Round Up: 2023 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది క్రీడల్లో మన ఇండియా టీమ్ ఎలా రాణించింది.. మన ప్లేయర్స్ ఎలాంటి ప్రదర్శన చేశారన్న విషయాల గురించి పలువురు ఆరా తీస్తున్నారు. క్రికెట్ నుంచి జావెలిన్ త్రో వరకు టీమిండియా అన్ని క్రీడల్లో తన సత్తా చాటింది

2023 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది క్రీడల్లో మన ఇండియా టీమ్ ఎలా రాణించింది.. మన ప్లేయర్స్ ఎలాంటి ప్రదర్శన చేశారన్న విషయాల గురించి పలువురు ఆరా తీస్తున్నారు. క్రికెట్ నుంచి జావెలిన్ త్రో వరకు టీమిండియా అన్ని క్రీడల్లో తన సత్తా చాటింది. ఆసియా క్రీడల్లో 22 విభాగాల్లో భారత్ 107 పతకాలను కైవసం చేసుకుంది. మరోవైపు క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ టైటిల్‌కు కూతవేటు దూరంలో నిలిచిపోయినా మన జట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌కు అభిమానులు పోటెత్తి మన టీమ్‌కు సపోర్ట్ ఇచ్చినా మన ఆటగాళ్లు వినియోగించుకోలేక ఒత్తిడికి గురై చేతులెత్తేశారు.

క్రికెట్

ఈ ఏడాదిని భారత మహిళా జట్టు తొలుత దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో తలపడగా గ్రూప్ స్టేజీలోనే ఓటమిపాలైంది. అనంతరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తలపడింది. ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో ఓడినా.. అదే జట్టుతో తలపడిన ఏకైక టెస్టులో, ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా మహిళలు విజయం సాధించి ఏడాదిని ముగించారు. ఆసియా క్రీడల్లో హర్మన్ ప్రీత్‌కౌర్ నాయకత్వంలోని జట్టు స్వర్ణ పతకం కూడా సాధించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ20లను భారత మహిళా జట్టు ఆడనుంది.

పురుషుల జట్టు విషయానికి వస్తే.. స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీ20 సిరీస్‌లను గెలిచిన ఈ ఏడాదిని అద్భుతంగా టీమిండియా ప్రారంభించింది. కానీ ఐపీఎల్ తర్వాత జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. అంతకుముందు స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మాత్రం టీమిండియా కైవసం చేసుకుంది. గత మూడేళ్లలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలవడం ఇది రెండోసారి. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో మన జట్టు వైట్ బాల్ క్రికెట్ ఆడింది. అనంతరం ఆరు దేశాలతో నిర్వహించిన ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కూడా గెలుచుకుంది. ఇక వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ఫైనల్లో మాత్రం ఓటమి పాలైంది. తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడ్డ టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌తో పాత సంవత్సరాన్ని ముగించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది.

అథ్లెటిక్స్

ఈ ఏడాది అథ్లెటిక్స్ విషయానికి వస్తే ముందుగా నీరజ్ చోప్రా గురించి చెప్పుకోవాలి. ఈ విభాగంలో ఆసియా క్రీడల్లో భారత్ 22 పతకాలను కైవసం చేసుకుంది. లాంగ్ జంప్, షాట్‌పుట్, రేస్ వాకింగ్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో టీమిండియా క్రీడాకారులు రాణించారు. డైమండ్ లీగ్‌లో జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఆగస్టులో జరిగిన వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో 88.17 మీటర్ల మేర జావెలిన్ త్రో చేసి తొలిసారిగా గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు.

హాకీ, కబడ్డీ

హాకీలో ఈ ఏడాది భారత పురుషుల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. మహిళల జట్టు మాత్రం రెండోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుని వచ్చే ఏడాది ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మహిళల హాకీ జట్టు మాత్రం కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. కబడ్డీలో పురుషుల జట్టు, మహిళా జట్టు ఒక్కో స్వర్ణం సాధించాయి.

ఫుట్‌బాల్

ఫుట్‌బాల్ విషయానికి వస్తే SAFF ఛాంపియన్ షిప్‌లో కువైట్‌తో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా ముగియగా పెనాల్టీ షూటవుట్‌లో గెలిచి టీమిండియా టైటిల్ విజేతగా నిలిచింది

రెజ్లింగ్

ఈ ఏడాది రెజ్లింగ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ చర్యలకు వ్యతిరేకంగా ఇండియా రెజ్లర్లు జనవరిలో నిరసన చేపట్టారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లతో పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో ఉద్యమంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా వాళ్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలు ఆలస్యం చేయడంతో WFIపై UWW నిషేధం విధించింది. ఇటీవల ఎన్నికలు నిర్వహించగా బ్రిజ్ భూషణ్ సహాయకుడు సంజయ్ సింగ్ గెలవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో పలువురు రెజ్లర్లు మళ్లీ నిరసన చేపట్టారు. అయితే కొత్త WFIపైనా సస్పెన్షన్ విధించడంతో రెజ్లర్లకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

చెస్

ఈ ఏడాది చెస్ ప్రపంచ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ఓడిపోయినా భారత యువ సంచలనం ప్రజ్ఞానంద అందరి దృష్టిని ఆకర్షించాడు. అటు ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్‌గా మారింది. మరోవైపు ఆసియా క్రీడల్లో చెస్ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు కూడా వచ్చాయి.

బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్ స్టార్లు PV సింధు, లక్ష్య సేన్ ఈ ఏడాది నిరాశపరిచారు. కెనడా ఓపెన్‌లో మాత్రమే విజయం సింధు విజయం సాధించింది. ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల జట్టు రజతం, హెచ్‌ఎస్ ప్రణయ్ సింగిల్స్ విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్ జోడీ చారిత్రాత్మక స్వర్ణాన్ని గెలుచుకుంది. బ్యాడ్మింటన్‌లో చిరాగ్-సాత్విక్‌ ద్వయం ఈ ఏడాది చారిత్రాత్మక విజయాలు సాధించింది. ఎందుకంటే వారు నెం.1గా నిలవడమే కాకుండా దేశంలో అత్యున్నత క్రీడా గౌరవానికి ప్రతీక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా గెలుచుకున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 07:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising