ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL Playoffs Scenario: ముంబై ఇండియన్స్‌పై లక్నో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా ఉన్నాయ్.. చెన్నయ్ చివరి మ్యాచ్ గెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-17T18:58:59+05:30

ఐపీఎల్2023 నుంచి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ 2023 (IPL2023) సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ఒకటి రెండు జట్లు మినహా మిగతా టీమ్స్‌కు లీగ్ దశలో చివరి మ్యాచ్‌ మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ ప్లే ఆఫ్స్‌ ఆడబోయే జట్లపై క్లారిటీ లేదు. ఒక్క గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) మాత్రమే ఇప్పటివరకు అఫీషియల్‌గా నాకౌట్ దశలో అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...

మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై (Mumbai indians) ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ తన ప్లే ఆఫ్స్‌లో చోటుకు మరింత దగ్గరైంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచివుంటే నేరుగా క్వాలిఫై అయ్యుండేది. కానీ లక్నో గెలవడంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత సంక్లిష్టంగా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్...

లక్నో సూపర్ జెయింట్స్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 17 పాయింట్లతో ఫ్లే ఆఫ్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangulure), పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్లు 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నిలిచే అవకాశాలున్నాయి. లక్నో ప్రస్తుతమున్న 15 పాయింట్లతో కూడా అర్హత సాధించే ఛాన్స్ ఉంటుంది. కానీ పోటీలో ఉన్న జట్లు 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ఉండకూడదు.

ముంబై ఇండియన్స్..

ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్‌లో టాప్-4 జట్టుగా ఉంది. తదుపరి మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో క్వాలిఫై అవుతుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముంబైతో పోటీపడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో నెట్ రన్‌రేట్ అత్యంత కీలకమవనుంది.

ఒకవేళ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే మాత్రం మొత్తం 5 జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. ఈ సమీకరణంలో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమవడం ఖాయం.

చెన్నై సూపర్ కింగ్స్...

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 15 పాయింట్లతో ఉంది. ఒకవేళ మిగిలివున్న ఢిల్లీపై మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా అర్హత సాధిస్తుంది. అంతేకాదు టాప్-2లో చోటు దక్కించుకునే అవకాశమూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఓడిపోతే మాత్రం 16 పాయింట్లతో నిలిచే జట్లతో ప్లే ఆఫ్ అవకాశాలకు ప్రమాదం పొంచివుంటుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఘనవిజయాన్ని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుత నెట్‌ రన్‌రేట్ 0.166కి మెరుగుపడింది. ఇక మిగిలివున్న చివరి 2 మ్యాచుల్లో గెలిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ప్లే ఆఫ్స్‌కి చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా ఆశలు గల్లంతే అవుతాయి.

పంజాబ్ కింగ్స్...

పంజాబ్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టాప్-4లో చోటు దక్కించుకోవాలంటే మిగిలిన 2 మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో సమానంగా ఉన్న జట్లతో నెట్ రన్ రేట్ విషయంలో పోటీపడితే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు రన్ రేట్ మైనస్ 0.268గా ఉంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్ అవుతుంది.

రాజస్థాన్ రాయల్స్...

ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అవమానకర రీతిలో ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మొత్తం 5 జట్లు 14 పాయింట్లతో నిలిస్తే ప్లే ఆఫ్స్ రేసు సంక్లిష్టంగా మారుతుంది. అలా జరగాలంటే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌పై గెలవాల్సి ఉంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్...

కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. టీమ్ రన్‌రేట్ - 0.256గా ఉంది. కాబట్టి కేకేఆర్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కష్టమనే చెప్పాలి. ఒకవేళ తన తర్వాతి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని భారీ తేడాతో ఓడించి 14 పాయింట్లతో నిలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే ఔటయిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-17T18:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising