ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli IPL2023: ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్.. ఏమన్నాడంటే..

ABN, First Publish Date - 2023-05-23T22:38:11+05:30

ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కల మరోసారి చెదిరిపోవడాన్ని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఫ్యాన్స్‌తోపాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో లీగ్ దశలోనే ఆర్సీబీ కథ ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ ట్రోఫీని (IPL Trophy) ముద్దాడాలనే కల మరోసారి చెదిరిపోవడాన్ని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఫ్యాన్స్‌తోపాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై (Gujarat titans) జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో లీగ్ దశలోనే ఆర్సీబీ కథ ముగిసింది.

ఈ సీజన్‌లో జట్టు ప్రదర్శన ఫర్వాలేదనిపించినప్పటికీ కీలకమైన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకోవడంతో టోర్నీకి దూరమైంది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా జట్టు వెనుదిరగడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆటగాళ్లు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఆటగాళ్లంతా బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat kohli) తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు పెట్టాడు.

‘‘ తనదైన క్షణాలను మిగిల్చిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ దురదృష్టవశాత్తూ లక్ష్యం దరిచేరలేదు. నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ మనం తల ఎత్తుకునే ఉండాలి. ప్రతి అడుగులోనూ మద్ధతు తెలుపుతున్న నిజాయితీగల అభిమానులకు ధన్యవాదాలు. కోచ్‌లు, యాజమాన్యం, సహచర ఆటగాళ్లకు చాలా పెద్ద థ్యాంక్స్. లక్ష్యంతో బలంగా తిరిగొద్దాం’’ అని విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

కాగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే విరాట్ కోహ్లీ డ్రీమ్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ నెరవేరలేదు. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. కేవలం 61 బంతుల్లోనే 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. దీంతో టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 8కి చేరింది. ఎవరికీ అందనంత ఎత్తులో మొత్తం 22 సెంచరీలతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 9 సెంచరీలు చేశాడు.

Updated Date - 2023-05-23T22:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising