కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia cup final: ఆసియా కప్‌ను పైకెత్తిన ఇతడు ప్లేయర్ కాదు.. కోచ్ కాదు.. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా..

ABN, First Publish Date - 2023-09-18T10:22:16+05:30

ఆసియా కప్‌ను తొలుత ఎత్తిన ఆటగాళ్ల జాబితాలో 20 ఏళ్ల తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అతి పిన్న వయస్కుడు లేదా కొత్త ఆటగాడు ఇతరుల కంటే ముందుగా ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి తిలక్ వర్మకి ఈ అవకాశం వచ్చింది. అయితే ట్రోఫీని ఎత్తుకున్నవారిలో మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. అతడు ప్లేయర్ కాదు.. కోచ్ లేదా ఫిజియో కాదు. ఆటగాడు లేదా కోచ్ కాకపోయినా జట్టులో అతడు చాలా ముఖ్యమైన సభ్యుడు. అతడే...

Asia cup final: ఆసియా కప్‌ను పైకెత్తిన ఇతడు ప్లేయర్ కాదు.. కోచ్ కాదు.. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా..

కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ఆటతీరుని కనబరిచింది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కెరీర్‌లోనే బెస్ట్ ప్రదర్శన ఇవ్వడంతో శ్రీలంక జట్టు మొత్తం కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిరాజ్ ఏడు ఓవర్లు మాత్రమే వేసి కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు కుప్పకూల్చాడు. ఆ తర్వాత భారత్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8వసారి ఆసియా కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు, 2013 తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయిన భారత క్రికెట్ జట్టుకు ఈ గెలుపు మంచి బూస్ట్ ఇచ్చిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.


ఇదిలావుండగా ఆసియా కప్ ట్రోఫీని పలువురు టీమిండియా క్రికెట్లర్లు ట్రోఫీని ఎత్తుకున్నారు. తొలుత ట్రోఫీని ఎత్తిన ఆటగాళ్ల జాబితాలో 20 ఏళ్ల తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అతి పిన్న వయస్కుడు లేదా కొత్త ఆటగాడు ఇతరుల కంటే ముందుగా ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి తిలక్ వర్మకి ఈ అవకాశం వచ్చింది. అయితే ట్రోఫీని ఎత్తుకున్నవారిలో మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. అతడు ప్లేయర్ కాదు.. కోచ్ లేదా ఫిజియో కాదు. ఆటగాడు లేదా కోచ్ కాకపోయినా జట్టులో అతడు చాలా ముఖ్యమైన సభ్యుడు. అతడే రఘు రాఘవేంద్ర(Raghu Raghavendra). 'త్రో-డౌన్ స్పెషలిస్ట్'గా (throw-down specialist) జట్టులో కొనసాగుతున్నాడు. నెట్స్‌లో భారత బ్యాటర్లకు స్లింగర్‌తో బంతులు విసరడమే అతడి పని. ఈ విధంగా టీమిండియా ఇతనొక్కడే కాదు.. ఇద్దరు త్రోడౌన్ నిపుణులు కూడా టీమిండియా కోసం బీసీసీఐ నియమించింది.


ఇక రాఘవేంద్ర విషయానికి వస్తే అతడు జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి బీసీసీఐలో చేరాడు. ఇండియాలో మొదటి త్రో-డౌన్ స్పెషలిస్ట్ ఇతడే కావడం విశేషం. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోనీలకు కూడా ఇతడు బంతులు విసిరాడు. ఇదిలావుండగా త్రో-డౌన్ స్పెషలిస్ట్‌ల గురించి విరాట్ కోహ్లీ గతంలో ఓసారి ప్రశంసలు కురిపించాడు. బ్యాట్స్‌మెన్లకు క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌లో నమ్మశక్యం కానివిధంగా ఈ కుర్రాళ్లు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. త్రో-డౌన్ స్పెషలిస్టులకు చాలా క్రెడిట్ దక్కాల్సి ఉందన్నారు. వారి పేర్లు, ముఖాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జట్టు విజయంలో వీరి పాత్ర కూడా ముఖ్యమేనని, చాలా కృషి ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-18T10:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising