ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final Australia vs India: నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్.. స్కోర్ ఎంతంటే..

ABN, First Publish Date - 2023-06-07T19:10:24+05:30

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) Day 1లో భాగంగా తొలి రోజు రెండో సెషన్ ప్రారంభంలోనే మూడో వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) Day 1లో భాగంగా తొలి రోజు రెండో సెషన్ ప్రారంభంలోనే మూడో వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 39 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ 65 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు.

రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారత (India) బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు. షమీ బౌలింగ్‌లో మార్నస్ లాబుషేన్ బౌల్డ్ అయ్యాడు. మార్నస్ లాబుషేన్ 62 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 24.1 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 76 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది.

భోజన విరామం సమయానికి 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు 73 పరుగులు చేసింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్‌ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది.

60 బంతుల్లో డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేశాడు. ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఉస్మాన్ ఖవాజా 10 బంతులు ఆడి పరుగులు రాబట్టకపోగా.. సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Updated Date - 2023-06-07T19:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising