ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Year Ender 2023: ఈ ఏడాది వార్తల్లో నిలిచిన టాప్-4 క్రీడాకారులు.. క్రికెట్ కాదండోయ్..!!

ABN, Publish Date - Dec 23 , 2023 | 03:39 PM

Year Ender 2023: భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే అభిమానులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు నెమ్మదిగా ఆదరణ పెరుగుతోంది. హాకీ, ప్రొ కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి క్రీడలు కూడా భారతీయులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో 2023లో క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో కొందరు ఆటగాళ్లు విశేషంగా రాణించారు.

భారత్‌లో క్రికెట్‌ను ఆరాధించే అభిమానులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు నెమ్మదిగా ఆదరణ పెరుగుతోంది. హాకీ, ప్రొ కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి క్రీడలు కూడా భారతీయులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో 2023లో క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో కొందరు ఆటగాళ్లు విశేషంగా రాణించారు.

1) నీరజ్ చోప్రా

గత ఏడాది జరిగిన వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్‌ సొంతం చేసుకున్న జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా 2023లోనూ అద్భుతంగా రాణించాడు. మేలో దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ టోర్నీలో 88.67 మీటర్ల మేర జావెలిన్ త్రో చేసి రాణించడంతో నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఆగస్టులో జరిగిన వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో 88.17 మీటర్ల మేర జావెలిన్ త్రో చేసి తొలిసారిగా గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు.

2) సాత్విక్- చిరాగ్ జోడీ

భారత్‌కు సంబంధించి నంబర్‌వన్ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది సత్తా చాటుకున్నారు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా జోడీ రెన్ జియాంగ్, తాన్ కియాంగ్‌పై విజయం సాధించి తమ తొలి టైటిల్ కైవసం చేసుకున్నారు. దీంతో భారత్‌ను కొత్త శిఖరాలకు చేర్చారు. అనంతరం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ టోర్నీలోనూ విక్టరీ సాధించారు. ఆ తర్వాత ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో గెలిచారు. అంతేకాకుండా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 1000 ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుని ఇండియా నుంచి ఈ ఫీట్ సాధించి తొలి పురుషుల డబుల్స్‌గా నిలిచారు. ఈ ఏడాదే జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లోనూ ఈ జోడీ అదరగొట్టింది.

3) నిఖత్ జరీన్

బాక్సింగ్‌కు సంబంధించి ఈ ఏడాది భారత్ ప్రతిష్టను నిఖత్ జరీన్ నిలబెట్టింది. 48-50 కిలోల విభాగంలో రెండోసారి మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కిరీటాన్ని నిలబెట్టుకుంది. తద్వారా దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌ల ఫైనల్లో వియత్నాంకు చెందిన గుయెన్ తీ టామ్‌పై 5-0 తేడాతో నిఖత్ జరీన్ విజయం సాధించింది.

4) జ్యోతి సురేఖ వెన్నం

ఆర్చరీలో పురుషులతో సమానంగా మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది జ్యోతి సురేఖ వెన్నం ఆర్చరీలో మహిళల తరఫున సత్తా చాటుకుంది. ఆసియా క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల టీమ్, వ్యక్తిగత విభాగం, మిక్స్‌డ్ టీం విభాగాల్లో జ్యోతి సురేఖ వెన్నం పతకాలను కైవసం చేసుకోవడం గమనించాల్సిన విషయం. జ్యోతి సురేఖ ఏపీకి చెందిన క్రీడాకారిణి కావడం విశేషం. 27 ఏళ్లకే ఆమె అర్జున అవార్డును గెలుచుకున్న ఆర్చర్‌గా ఘనత సాధించింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 03:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising