ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Airtel: జియోకు పోటీగా అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చిన ఎయిర్‌టెల్.. రూ.1,499తో రిచార్జ్ చేసుకుంటే..

ABN, First Publish Date - 2023-11-25T11:30:44+05:30

జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్‌టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.

జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్‌టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది. ముఖ్యంగా జియో రోజువారీ డేటా, అపరిమిత మొబైల్ కాల్స్ వంటివి తీసుకురావడంతో టెలికాం రంగంలో ఆ సంస్థ హవా పెరిగింది. దీంతో జియోను తట్టుకోవడానికి ఇతర టెలికాం సంస్థలు కూడా వినియోగదారులకు అదే స్థాయిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్త మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌‌ను కూడా అందించనుంది. 5జీ డేటా వేగంతోపాటు ప్రతిరోజూ 3జీబీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్‌ను పొందాలంటే ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.1,499 రూపాయలతో రిచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, యాప్‌లో ఈ ప్లాన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.


ఈ ప్లాన్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రూ.1,499తో ఎయిర్ వినియోగదారులు రిచార్జ్ చేసుకుంటే 5జీ వేగంతో ప్రతి రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్‌‌తోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల వరకు పంపుకోవచ్చు. దీన్ని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. అలాగే అపోలో 24|7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్‌తో సహా అనేక సప్లిమెంటరీ ఆఫర్లు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ రూ.199గా ఉంది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ప్లాన్‌ను రిచార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఖర్చును ఆదా చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాలను క్లెయిమ్ చేసే ప్రక్రియ మాదిరిగానే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

కాగా ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ఇప్పటికే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. రూ. 1,099 ప్లాన్‌లో భాగంగా మొబైల్ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా వేగంతో 2జీబీ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇదే పెద్ద స్క్రీన్ అనగా ల్యాప్‌టాప్స్, టీవీలు వంటి వాటిలో 84 రోజులకు రూ. 1,499 వెచ్చించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-11-25T11:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising