Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సభ్యత్వం ప్రారంభం.. ప్రయోజనాలు ఇవే..
ABN, First Publish Date - 2023-06-15T17:01:28+05:30
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) వార్షిక సభ్యత్వ వెర్షన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) వార్షిక సభ్యత్వ వెర్షన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంతమంది కస్టమర్లతో ప్లాన్‌ను ప్రారంభించామని, ఇప్పుడు వినియోగదారులందరికీ యాక్సెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ-కామర్స్ దిగ్గజం పేర్కొంది.
ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ తెలిపింది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక చందా రూ. 999కే లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ వార్షిక ప్లాన్ తీసుకున్న కస్టమర్లకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రెండు రోజులపాటు ఉచిత డెలివరీ చేస్తామని సంస్థ తెలిపింది. సాధారణ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పోలిస్తే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండదని పేర్కొంది.
ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర ఇలా ఉంది.
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ లైట్ ధర ఒక సంవత్సరానికి రూ. 999, ఇది సాధారణ ప్లాన్ కంటే చాలా తక్కువ, ఏడాది సాధారణ ప్లాన్ రూ.1,499, ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు
కొత్తగా ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు పొందాలనుకునే కస్టమర్లకు చౌకైన ప్రత్యామ్నాయం ఇదీ. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో అమెజాన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులకు అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీకి అనుమతి ఉంటుందని సంస్థ తెలిపింది.
Updated Date - 2023-06-15T17:02:46+05:30 IST