ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Best 5G Smartphones: సెప్టెంబర్ నెలలో రూ.15 వేల లోపు ధరతో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే!

ABN, First Publish Date - 2023-09-07T19:59:40+05:30

ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్‌లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్‌లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా ఇంటర్నెట్ వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగానే మొబైల్ కంపెనీలు కూడా 5జీ మొబైల్స్‌తో మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల 5జీ మొబైల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని రాబోతున్నాయి. దీంతో మొబైల్ వినియోగదారుల్లో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో తెలియక గందరగోళం ఏర్పడిందనే చెప్పుకోవాలి. అయితే చాలా మంది వీలైనంత తక్కువ ధరలోనే 5G స్మార్ట్ ఫోన్స్ కొనాలని ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఆన్‌లైన్ మాధ్యమాల్లో తెగ వెతికేస్తుంటారు. మొబైల్స్ కంపెనీలు కూడా కొన్ని సార్లు ప్రత్యేక ఆఫర్లతో ధరలను తగ్గిస్తుంటాయి. అయితే ఆఫర్ల గురించి పక్కన పెడితే ప్రస్తుత సెప్టెంబర్ నెలలో మార్కెట్‌లో రూ.15 వేల లోపు ధరతో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో ఒక సారి పరిశీలిద్దాం.


vivo T2x 5G

15 వేల లోపు ధరతో మంచి 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి వివో టీ2ఎక్స్ 5జీ (vivo T2x 5G) మంచి ఎంపిక. 6 GB RAM, 128 GB ROM స్టోరేజ్ కల్గిన ఈ 5జీ మొబైల్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999గా ఉంది. ఈ మొబైల్ మిగతా ఫీచర్ల విషయానికొస్తే డిస్‌ప్లే సైజ్ 16.71 సెంటిమీటర్లుగా ఉంది. బ్యాక్ కెమెరా 50MP + 2MP గా ఉండగా.. ఫ్రంట్ కెమెరా 8MPగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAhగా ఉంది. డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను కల్గి ఉంది. ఇక ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది. ఇవే ఫీచర్లతో 4GB RAM గల స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999గా ఉంది.

MOTOROLA G62 5G

15 వేల లోపు ధరతో అందుబాటులో ఉన్న మరో 5జీ స్మార్ట్ ఫోన్ మోటో జీ62 5 జీ(MOTOROLA G62 5G). 8 GB RAM, 128 GB స్టోరేజ్ కల్గిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. డిస్‌ప్లే సైజ్ విషయానికొస్తే ఫుల్ హెచ్‌డీతో 41.94 సెంటీ మీటర్లుగా ఉంది. 50MP + 8MP + 2MP బ్యాక్ కెమెరా ఉండగా.. 16MP ఫ్రంట్ కెమెరా (Front Camera) ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAhగా ఉంది. ఇవే ఫీచర్లతో 6 GB RAM కల్గిన మోటో జీ62 5జీ ఫోన్ ధర రూ.13,999గా ఉంది. ఇక ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది.

Infinix Note 30 5G

15 వేల లోపు ధర కల్గిన మరో 5జీ మొబైల్ ఫోన్ Infinix Note 30 5G. 4 GB RAM, 128 GB ROM కల్గిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజీను 2 టీబీ(TB) వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. పూర్తి హెచ్‌డీతో కూడిన ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ 17.22 సెంటీ మీటర్లుగా ఉంది. బ్యాక్ కెమెరా ఏకంగా 108 MP + 2 MPతోపాటు AI Lens ఉండడం గమనార్హం. ఫ్రంట్ కెమెరా 16 MPగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. దాని కెపాసిటీ 5,000 mAhగా ఉంది. ఇక ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది.

realme 11x 5G

15 వేల లోపు ధరతో అందుబాటులో ఉన్న మరో మంచి 5జీ స్మార్ట్ ఫోన్ realme 11x. 6 GB RAM, 128 GB ROMతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్ స్టోరేజీను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. హెచ్‌డీతో కూడిన ఈ మొబైల్ డిస్‌ప్లే సైజ్ 17.07 సెంటి మీటర్లుగా ఉంది. బ్యాక్ కెమెరా 64MP + 2MP కాగా ఫ్రంట్ కెమెరా 8MPగా ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ విషయానికొస్తే 5000 mAhగా ఉంది. ఇక ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది.

Updated Date - 2023-09-07T20:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising