Aadhaar update: ఆధార్ అప్‌డేట్‌కు చివరి తేదీ ఇదే! వెంటనే ఇలా అప్‌డేట్ చేసుకోండి..
ABN, First Publish Date - 2023-11-23T09:04:31+05:30
మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయిందా? అయితే వెంటనే వెళ్లి అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఈ గడువు త్వరలో ముగియనుంది.
మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయిందా? అయితే వెంటనే వెళ్లి అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఈ గడువు త్వరలో ముగియనుంది. ఈ నెల 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించింది. ఒకవేళ గడువు దాటితే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటగా ఆధార్ అప్‌డేట్ ప్రవేశపెట్టినప్పుడు రూ.50 ఫీజు వసూలు చేసింది. కానీ ప్రస్తుతం ఉచితంగానే అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అప్‌డేట్‌లో ఆధార్ వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, వేలి ముద్రలు, ఫోటోగ్రాఫ్ తదితరాలు మార్చుకోవచ్చు.
ఆధార్‌ని ఎందుకు అప్‌డేట్ చేసుకోవాలి?
ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. డేటా కచ్చితమైనదని, తాజా సమాచారమని నిర్దారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ కార్డుల ద్వారా మోసాలను కూడా అప్‌డేట్ చేసుకోవడం ద్వారా అరికట్టవచ్చు. మహిళలకు వివాహం అయిన తర్వాత పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలు మారుతాయి. పలువురు కొత్త ప్రాంతాలకు మారుతుంటారు. దీంతో చిరునామా, మొబైల్ నంబర్‌లో మార్పులు అవసరం అవుతాయి. ఇలా రకరకాల కారణంతో మార్పులు అవసరమైన వారు అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా బయోమెట్రిక్ డేటాను అందించాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి
UIDAI వెబ్‌సైట్ (uidai.gov.in)ని సందర్శించండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను సృష్టించండి.
"నా ఆధార్"పై(My Aadhaar) క్లిక్ చేయండి. ట్యాబ్ చేసి "మీ ఆధార్‌ని అప్‌డేట్ చేయండి"(Update Your Aadhaar) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి.
మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
మీరు అప్‌డేట్ చేయాలకున్న వివరాలను ఎంచుకోండి. కొత్త సమాచారాన్ని జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్‌మిట్ చేయండి.
మీ అప్‌డేట్ వివరాలను ధృవీకరించడానికి అవసరమైన సహాయక పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
ప్రక్రియను పూర్తిచేయడానికి "అప్‌డేట్ అభ్యర్థనను సమర్పించండి". (Submit Update Request)
మీ మొబైల్ నంబర్‌కు మిస్సెజ్ రూపంలో యూఆర్‌ఎన్ (URN) నంబర్ ఇస్తుంది. దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ అప్‌డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
myaadhaar.uidai.gov.in/ని సందర్శించి నమోదును తనిఖీ చేయిపై క్లిక్ చేయండి.
మీ నవీకరణ అభ్యర్థన స్థితిని వీక్షించడానికి మీ URNని నమోదు చేయండి.
Updated Date - 2023-11-23T09:12:48+05:30 IST