ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jio Offer: 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా

ABN, First Publish Date - 2023-02-04T20:28:28+05:30

ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిద్వార్‌: ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా జియో ట్రూ 5జీ సర్వీసులను (Jio True 5G Service) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌ (Haridwar) నగరంలో ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 226 నగరాల్లో జియో ట్రూ 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని జియో సంస్థ ప్రకటించింది. ఈ రోజు హరిద్వార్‌ వాసులకు టెలికం కంపెనీ జియో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.

జియో వెల్‌కమ్ ఆఫర్‌కు కస్టమర్స్ ఆహ్వానించబడతారని టెలికాం కంపెనీ పేర్కొంది. జియో నెట్‌వర్క్ ద్వారా 5G (ఐదవ తరం మొబైల్ సిస్టమ్) సేవలు అందించడం చాలా సంతోషకరమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami ) అన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్ (Dehradun) నగరం నుంచి ప్రారంభమైన జియో ట్రూ 5జీ సేవలు హరిద్వార్‌ నగరం వరకు విస్తరించి ఈ రోజు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సేవలు హరిద్వార్ ప్రజలే కాకుండా, సమీప భవిష్యత్తులో చార్ ధామ్ (Char Dhams) యాత్రకు వచ్చే యాత్రికులతోపాటు దేశ, విదేశాల నుంచి పవిత్ర హరిద్వార్‌ను సందర్శించే యాత్రికులు కూడా ప్రయోజనం పొందుతారని తెలిపారు.

రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుంచి ఇండో-టిబెట్ సరిహద్దు వైపు ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని చివరి భారతీయ గ్రామమైన మనా వరకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్ కవరేజీని కలిగి ఉందని జియో తెలిపింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే జియో నెట్‌వర్క్ ద్వారా 5జీ సేవలను ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో ఉత్తరాఖండ్‌లోని అన్ని ప్రధాన పట్టణాల్లో జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికేశ్‌లో జరగబోయే జీ20 సమ్మిట్ ఈవెంట్‌లలో డిజిటల్ దేవభూమిగా రాష్ట్రానికి నిజమైన ప్రాతినిధ్యం అవుతుందని, ఈ సందర్భంగా తాను హరిద్వార్ ప్రజలకు మరియు ఉత్తరాఖండ్‌లోని జియో నెట్‌వర్క్‌ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం చెప్పారు.

Updated Date - 2023-02-04T20:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising