ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Moto నుంచి 5G ఫోన్ వచ్చేసిందోచ్!.. ఫీచర్లు అదిరిపోయాయి.. ఓ లుక్కేయండి!

ABN, First Publish Date - 2023-09-06T16:52:43+05:30

Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మోటో జీ54 5జీ ఫోన్ రెండు రకాల వేరియంట్లతో లభించనుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ గల ఫోన్ ఒకటైతే, మరొకటి 12GB RAM + 256GB స్టోరేజ్‌తో విడుదలైంది. 8GB RAM + 128GB గల Moto G54 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,9999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై( ICICI bank Credit Card) రూ.1000 డిస్కౌంట్ కూడా లభించనుంది. 12GB RAM + 256GBతో స్టోరేజ్ గల Moto G54 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,500 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఇప్పటికే 5జీ మొబైల్స్ విడుదల చేసిన రెడ్ మీ 12(Redmi 12), రియల్‌మీ 11 ఎక్స్ (Realme 11X)కు మోటో జీ54 గట్టి పోటినిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా సెప్టెంబర్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) ఈ ఫోన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కొనుగోలు చేయానికి మాత్రం సెప్టెంబర్ 13 నుంచి అవకాశం ఉండనుంది.


ఫీచర్లు:

ఈ మెబైల్స్ ఫీచర్ల విషయానికొస్తే హెచ్‌డీ డిస్‌ప్లే కల్గిన మోటో జీ 54 5జీ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే సైజ్ 16.51గా సెంటి మీటర్లుగా ఉంది. రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి 50ఎంపీ, మరొకటి 8 ఎంపీగా ఉంది. దీంతో బ్యాక్ కెమెరా 50MP + 8MPగా ఉంది. నిజానికి మోటో సిరీస్‌లో గతంలో మూడు బ్యాక్‌ కెమెరాలను తీసుకొచ్చారు. కానీ వాటిని మళ్లీ రెండింటికే తగ్గించారు. ఇక ఫ్రంట్ కెమెరా 16MPగా ఉంది. 128 జీబీ, 256 జీబీగా ఉన్న స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 6,000గా ఉంది. ఇది టర్బో చార్జింగ్‌కు మద్దతిస్తుంది. మొబైల్ వెంటనే 33W టర్బో ఛార్జర్ కూడా రానుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7029 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. ఈ మొబైల్స్ మూడు రకాల రంగులలో లభించనున్నాయి. మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పెర్లు బ్లూ రంగులో అందుబాటులో ఉన్నాయి. ఇతర Motorola స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే Moto G54 కూడా క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది Android 13తో వస్తుంది. భవిష్యత్తులో Android 14కి అప్‌డేట్ చేసుకోవచ్చు. Moto Secure, Family Space వంటి కొన్ని యాజమాన్య యాప్‌లు, ఫీచర్‌లు ఫోన్‌తోపాటే వస్తాయి. Moto G54 మొబైల్స్ రక్షణ కోసం అల్ట్రా-ప్రీమియం 3D PMMA ముగింపుతో సొగసైన డిజైన్‌ను తయారుచేశారు. ఇది 8.89 మీ.మీ. సన్నగా ఉంటుంది. 189 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది IP52 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇక అన్ని ఫోన్‌లలో మాదిరిగానే డ్యూయల్ సిమ్ అవకాశం కూడా ఉంది.

Updated Date - 2023-09-06T16:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising