ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Realme Flip: ఆ రూమర్లను నిజం చేసిన రియల్‌మీ.. ఆ ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయి!

ABN, First Publish Date - 2023-03-09T18:32:19+05:30

ఇప్పుడా ఊహాగానాలకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెరదించారు. వాటిని తీసుకొస్తున్నట్టు హింట్ ఇచ్చారు. రియల్‌మీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ రియల్‌మీ(Realme) నుంచి ఫోల్డబుల్, ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడా ఊహాగానాలకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెరదించారు. వాటిని తీసుకొస్తున్నట్టు హింట్ ఇచ్చారు. రియల్‌మీ ఫోల్డబుల్, ఫ్లిప్‌ఫోన్లకు మీరు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారని ఫాలోవర్లను ప్రశ్నించడం ద్వారా వాటిని తీసుకొస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో ఇప్పుడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు సర్వసాధారణమయ్యాయి. శాంసంగ్, వివో, ఒప్పో, టెక్నో, షావోమీ వంటి బ్రాండ్లు ఇప్పటికే తమ పోర్ట్‌ఫోలియోలో ఈ ఫోన్లను తీసుకొచ్చాయి. ఇప్పుడు వాటి సరసన నిలిచేందుకు రియల్‌మీ రెడీ అవుతోంది..

రియల్‌మీ తమ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. రియల్‌మీ సోదర సంస్థ వన్‌ప్లస్ మాత్రం ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి టీజ్ చేసింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దీనిని తీసుకురానుంది.

శాంసంగ్‌దే హవా

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం దక్షిణ కొరియా బ్రాండ్ శాంసంగ్(Samsung) అగ్రగామిగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4(Samsung Galaxy Z Fold 4), గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4(Galaxy Z Flip 4)‌ స్మార్ట్‌ఫోన్లను తాజాగా తీసుకొచ్చింది. ఫోల్డబుల్ ఫోన్ల టెక్నాలజీ పెరుగుతుండడం, వినియోగదారుల నుంచి వీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా కంపెనీలు కూడా ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లపై దృష్టి సారించాయి.

చైనీస్ కంపెనీలన్నీ..

హువేయి, మోటరోలా, షావోమి కూడా ఇప్పటికే కొత్త ఫోల్డబుల్ మోడల్స్‌ను విడుదల చేశాయి. హువేయి ‘మేట్ ఎక్స్’, ‘మేట్ ఎక్స్2’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. షావోమి ‘మిక్స్ ఫోల్డ్ 2’ను తీసుకురాగా, మోటో ‘రేజర్ 2022’ను గతేడాది చైనాలో రిలీజ్ చేసింది. అలాగే, బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన వివో చైనాలో ‘వివో ఎక్స్ ఫోల్డ్’ను విడుదల చేసింది. దీనికి సక్సెసర్‌గా ‘వివో ఎక్స్ ఫోల్డ్2’ను తీసుకొస్తోంది.

టెక్నో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఫాంటమ్ వి ఫోల్డ్’ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. గతేడాది డిసెంబర్‌లో ఒప్పో ‘ఫైండ్ ఎన్2’, ‘ఫైండ్ ఎన్2 ఫ్లిప్’లను విడుదల చేసింది. ఇక, రియల్‌మీ నుంచి త్వరలో రాబోతోన్న ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4, షావోమీ మిక్స్ ఫోల్డ్ 2, మోటరోలా రేజర్ 2022కు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2023-03-09T18:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising