ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Realme: బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఈ నెల 18 వరకు ఆగండి.. అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న రియల్‌మీ!

ABN, First Publish Date - 2023-05-11T15:48:38+05:30

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లతో పలకరించే రియల్‌మీ (Realme) మరో స్మార్ట్‌ఫోన్‌ను (SmartPhone) ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లతో పలకరించే రియల్‌మీ (Realme) మరో స్మార్ట్‌ఫోన్‌ను (SmartPhone) ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. రియల్‌మీ నజ్రో ఎన్53 (Realme Narzo N53) పేరిట ఈ నెల 18న స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అయితే అధికారికంగా ఈ ఫోన్ విడుదలవ్వక ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు తెలిశాయి. నజ్రో ఎన్-సిరీస్‌లో రెండు నెలల వ్యవధిలోనే వస్తున్న రెండవ స్మార్ట్‌ఫోన్ ఇది. గత నెలలో నజ్రో ఎన్55 ఫోన్‌ బేస్ వేరియెంట్ ధర రూ.10,999గా ఉంది. ఈ స్థాయి రేటులో చక్కటి కెమెరా సిస్టమ్‌ను అందించింది. అయితే నజ్రో ఎన్55 కంటే నజ్రో ఎన్53 ఫోన్ రేటు తక్కువగా ఉండొచ్చనే అంచనాలున్నాయి.

కాగా కంపెనీ విడుదల చేసిన ఇమేజ్ ప్రకారం... నజ్రో ఎన్53 ఫోన్ గోల్డ్ ఫిష్ కలర్‌లో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు నజ్రో సిరీస్‌లో ఇలాంటి ఫోన్లు రాలేదనే విషయం తెలిసిందే. ఫోన్ వెనుక ప్యానల్‌లో 3 కటౌట్స్ ఉండగా అందులో 2 కెమెరాలు, 1 ఎల్‌ఈడీ ఫ్లాష్‌గా ఉన్నాయి. ఇక ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్స్ (Volume rockers), పవర్ బటన్ ఉన్నాయి. పవర్‌బటన్ ‘ఫింగర్‌ప్రింట్ స్కానర్’గా మాదిరిగా కూడా కనిపిస్తోంది. 16జీబీ వర్చుల్ ర్యామ్, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నట్టు ట్విటర్ యూజర్లు చెబుతున్నారు. ఇక బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉండొచ్చు. ధరతోపాటు పూర్తి వివరాలు తెలియాలంటే ఫోన్ లాంచ్ అయ్యేవరకు వేచిచూడాల్సిందే. కాగా త్వరలోనే విడుదల కానున్న రియల్‌మీ నజ్రో ఎన్53 ఫోన్ ‘అమెజాన్’పై అమ్మకానికి సిద్ధంగా ఉండనుంది.

Updated Date - 2023-05-11T15:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising