ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Redmi 12 mobiles: తొలి రోజే మైలురాయిని చేరుకున్న Redmi 12 సిరీస్.. ఎన్ని లక్షల మొబైల్స్ అమ్ముడయ్యాయో తెలిస్తే..?

ABN, First Publish Date - 2023-08-05T20:27:08+05:30

Xiaomi ఇండియా నుంచి తాజాగా విడుదలైన రెడ్‌ మీ 12(Redmi 12) సిరీస్ ప్రారంభించిన మొదటి రోజే రికార్డులు సృష్టించింది. ఈ సిరీస్ నుంచి విడుదలైన మొబైల్స్‌ మొదటి రోజే ఏకంగా 3,00,000 పైగా అమ్ముడయ్యాయి. దీంతో మొబైల్ మార్కెట్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది.

Xiaomi ఇండియా నుంచి తాజాగా విడుదలైన రెడ్‌ మీ 12(Redmi 12) సిరీస్ ప్రారంభించిన మొదటి రోజే రికార్డులు సృష్టించింది. ఈ సిరీస్ నుంచి విడుదలైన మొబైల్స్‌ మొదటి రోజే ఏకంగా 3,00,000 పైగా అమ్ముడయ్యాయి. దీంతో మొబైల్ మార్కెట్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. కాగా రెడ్‌ ‌మీ మొబైల్స్ నుంచి ఇటీవల Redmi 12 5G, Redmi 12 అనే రెండు రకాల మొబైల్స్ విడుదలయ్యాయి. Redmi 12 సిరీస్ ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కల్గి ఉంది. అలాగే సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నఈ మొబైల్స్ అసాధారణమైన పని తీరును కనబరుస్తూ మార్కెట్లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతున్నాయి. ఇక Redmi 12 5G విషయానికొస్తే.. ఇది స్నాప్‌డ్రాగన్ 4వ Generation 2 5G ప్రాసెసర్‌తో కూడిన భారతదేశపు మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ప్రాసెసర్ ఫ్లాగ్‌షిప్-స్థాయి 4nm ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. వేగవంతమైన కనెక్టివిటీని ఎనబుల్ చేస్తుంది.


వీటి ధరల విషయానికొస్తే.. Redmi 12 4G, Redmi 12 5G మొబైల్స్ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్‌లతో ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. Redmi 12 4Gలో 4GB RAM+128GB Storage వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అలాగే 6GB RAM+128GB Storage వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్స్ Mi.com, Flipkart.com, Mi Home, Mi Studioలలో అందుబాటులో ఉన్నాయి. 5G మొబైల్స్ కావాలనుకునే వారికి Redmi 12 5Gలో 4GB RAM+128GB Storage వేరియంట్‌ ధర రూ.10,999గా ఉంది. అలాగే 6GB RAM+128GB Storage వేరియంట్‌కు రూ.12,499గా ఉంది. ఇక 8GB RAM+256GB Storage వేరియంట్‌ ధర రూ.14,499గా ఉంది. ఈ మొబైల్స్ ప్రస్తుతం Mi.com, Amazon.com, Mi Home, Mi Studioలలో అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ మొబైల్స్‌పై ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ వద్ద ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ ఉన్నట్లయితే Redmi 12 4G లేదా Redmi 12 5Gకి చెందిన 4GB RAM వేరియంట్ కొనుగోళ్లపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఇప్పటికే ఉన్న Xiaomiకి సంబంధించిన మొబైల్స్ కల్గి ఉన్న వాళ్లు ఎక్స్‌చేంజ్ పెట్టాలనుకుంటే Redmi 12 4Gకి చెందిన 4GB RAM వేరియంట్‌పై రూ.1000 బోనస్‌ను పొందవచ్చు. Redmi 12 4Gకి చెందిన 6GB RAM వేరియంట్ లేదా Redmi 12 5Gకి చెందిన 8GB RAM వేరియంట్‌ని కొనాలనుకుంటే రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

Updated Date - 2023-08-05T20:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising