ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Robo Food Delivery: మరో లెవల్‌కు టెక్నాలజీ.. ఫుడ్ డెలివరీ చేస్తున్న రోబోలు

ABN, First Publish Date - 2023-07-07T14:20:03+05:30

దుబాయ్‌ సిలికాన్ ఒయాసిస్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో అక్కడి ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఫుడ్ డెలివరీ రోబోలను ప్రవేశపెట్టింది. దీంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మనుషుల బదులు రోబోలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. రోబోలను చూసి అక్కడి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధునిక యుగంలో టెక్నాలజీ ఉంటే ఏదైనా సాధించొచ్చు అన్నదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. టెక్నాలజీతో మనిషి శారీరక శ్రమ విపరీతంగా తగ్గిపోతోంది. రోబోల సహాయంతో ఎలాంటి పనులైనా పూర్తి చేసేందుకు మన సైంటిస్టులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఫుడ్ డెలివరీ చేసే మనుషుల స్థానంలో పలు కంపెనీలు రోబోలను ప్రవేశపెట్టాయి. దుబాయ్‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దుబాయ్‌ సిలికాన్ ఒయాసిస్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో అక్కడి ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఫుడ్ డెలివరీ రోబోలను ప్రవేశపెట్టింది. దీంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మనుషుల బదులు రోబోలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. రోబోలను చూసి అక్కడి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము భోజనం కోసం నిరీక్షిస్తున్న సమయంలో మీ ఇంటికి ఫుడ్ వచ్చింది అన్న నోటిఫికేషన్ మొబైల్‌లో రాగానే ఇంటి తలుపు తీయగానే రోబోను చూసి ఆశ్చర్యపోయామని.. ఆ రోబో చాలా అందంగా ఉండటంతో పాటు ఫ్యూచరిస్టిక్‌గా కనిపించిందని.. దీంతో తాము థ్రిల్ అయ్యామని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు.

సాంకేతిక పురోగతి రోజురోజుకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి ఆవిష్కరణ, సౌలభ్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోటిక్ ఫుడ్ డెలివరీ దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌లోని కొన్ని జోన్‌లలో భోజనం పంపిణీ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితత్వంతో పనిచేస్తున్న రోబోలు అక్కడి రెస్టారెంట్ల నుంచి ఇంటి వరకు ఫుడ్ ఆర్డర్లను రవాణా చేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. సొగసైన డిజైన్, సమర్ధవంతమైన కదలికలతో చిన్న రోబోలు ఫుడ్ డెలివరీ చేస్తుండటం చూడముచ్చటగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సురక్షితమైన కంపార్ట్‌మెంట్‌లో దుబాయ్ పరిసర ప్రాంతాల్లో రోబోలు ఫుడ్ రవాణా చేస్తున్నాయి. డెలివరీ యాప్‌లో యూజర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ఆధారంగా తాము కంపార్ట్‌మెంట్లో పుడ్ ఐటమ్స్ పెట్టి అన్‌లాక్ చేస్తున్నామని.. తద్వారా ఎలాంటి డ్యామేజీలకు ఆస్కారం లేదని అక్కడి ఫుడ్ అథారిటీ అధికారులు చెప్తున్నారు. రుచి, వాసనలో ఎలాంటి మార్పులు ఉండవని.. రోబోల పుడ్ డెలివరీ ద్వారా మరపురాని భోజనాన్ని ఆస్వాదించవచ్చని హామీ ఇస్తున్నారు.

Updated Date - 2023-07-07T14:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising