Samsung: 8జీబీ ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్..
ABN, First Publish Date - 2023-07-11T16:40:40+05:30
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా 888 స్నాప్‌డ్రాగన్ ఎస్‌వోఎస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ (Samsung Galaxy S21 FE 5G ) స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.
భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్‌తోపాటు 256జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ రూ. 49,999 ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ల ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
888 స్నాప్‌డ్రాగన్ ఎస్‌వోఎస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5, లైట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్, వీడియో సెల్ఫీ కాల్స్, 6.4 అంగుళాల పూర్తి స్థాయి హెచ్‌డీ డిస్‌స్లే ఉంటుంది.
Updated Date - 2023-07-11T16:41:42+05:30 IST