Samsung: అద్భుత ఫీచర్లతో శాంసంగ్ 4కే స్మార్ట్ యూహెచ్‌డీ టీవీ విడుదల.. రేటెంతంటే..
ABN, First Publish Date - 2023-05-20T17:32:22+05:30
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ అండ్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ అండ్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ 2023 మోడల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీని ప్రవేశపెట్టామని సంస్థ పేర్కొంది.
భారత మార్కెట్‌లో శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ ధరలు ఇలా ఉన్నాయి.
43-అంగుళాల స్క్రీన్ మోడల్ శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ ప్రారంభ ధర రూ. 33,990 ఉంటుంది. 65-అంగుళాల డిస్ ప్లే మోడల్ టీవీ రూ. 71,990 ఉంటుందని సంస్థ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఈ-స్టోర్ల ద్వారా టీవీలను కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. శాంసంగ్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా టీవీలను కొనుగోలు చేస్తే 12 నెలల వరకు ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు ఉండవని కంపెనీ పేర్కొంది.
శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
స్మార్ట్ టీవీ 43-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌తోపాటు, 4కే రిజల్యూషన్‌తో హెచ్‌డీఆర్10 ప్లస్ డిస్‌ప్లే వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ తెలిపింది. కొత్త శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్‌డీ టీవీ 2023 మోడల్‌లో ఆన్‌బోర్డింగ్, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ సర్దుబాటు, సెన్సార్, వీడియో కాలింగ్ కోసం స్లిమ్‌ఫిట్ కెమెరా, 4కే రిజల్యూషన్‌తో HDR10+ డిస్‌ప్లే వంటి స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. భారత్‌లో శాంసంగ్ టీవీ ప్లస్‌లో 100 ఛానల్స్ వస్తాయని, ఆటో గేమ్ మోడ్ ఉంటుందని సంస్థ తెలిపింది.
Updated Date - 2023-05-20T17:49:37+05:30 IST