Realme: రియల్‌మీ నుంచి మార్కెట్‌లోకి అదిరిపోయే ఫోన్ .. 3 రోజులు మాత్రమే ఆఫర్.. అదిరిపోతున్న ఫీచర్లు!
ABN, First Publish Date - 2023-04-12T17:27:48+05:30
సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే చైనా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ (Realme) మరో మొబైల్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది...
న్యూఢిల్లీ: సరికొత్త ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే చైనా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ (Realme) మరో ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. మరోసారి నజ్రో సిరీస్ (Narzo series) ఫోన్లతో యూజర్లను పలకరించింది. రియల్‌మీ ఎన్55 (Realme N55) పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, 64-మెగా పిక్సెల్ ఏఐ కెమెరా సిస్టమ్‌తో ఈ సెగ్మెంట్‌లో ఇదే తొలి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,999 కాగా.. ప్రవేశ ఆఫర్‌గా రూ.1000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్టు రియల్‌మీ తెలిపింది.
కాగా రియల్‌మీ ఎన్55 ఫోన్ రెండు వేరియెంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియెంట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.12,999గా ఉంది. కాగా 6జీబీ డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ప్రైమ్ బ్లూ, ప్రై బ్యాక్ కలర్స్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా రియల్‌మీ ఎన్55 4జీబీ ర్యామ్ మోడల్ ఫోన్ రూ.10,499కే లభించనుంది. ఇక 6జీబీ ర్యామ్ మోడల్ రూ.11,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ధరలు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 21 వరకే వర్తిస్తాయి. కాబట్టి ఆసక్తిగల వినియోగదారులు ఏప్రిల్ 18 నుంచి ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ (Amazon), రియల్‌మీ.కామ్‌లపై (Realme.com) సేల్ అందుబాటులో ఉంటాయి.
రియల్‌మీ ఎన్55 ఫీచర్లు ఇవే..
రియల్‌మీ ఎన్55 ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ లెన్స్ 2 ఎంపీ రిసొల్యూషన్ బ్యాక్ కెమెరాతో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా. మొత్తంగా ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ కోసం రియల్‌మీ చాలా కెమెరా ఫీచర్లను అందిస్తోంది. బొకే ఫ్లేర్ పొట్రేయిట్, ఏఐ కలర్ పొట్రేయిట్, స్టారీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుంది. 33W SuperVOOC ఛార్జింగ్ సొల్యూషన్. 50 శాతం ఛార్జింగ్‌కు 29 నిమిషాలు పడుతుందని, ఇక 100 శాతం ఛార్జింగ్‌కు 63 నిమిషాల టైమ్ పడుతుందని కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత - సుకేశ్ చంద్రశేఖర్ వాట్సప్ చాటింగ్? సంచలన స్ర్కీన్‌షాట్లు షేర్ చేసిన సుకేశ్!
Opposition Unity : విపక్షాలను ఏకం చేసేందుకు చరిత్రాత్మక అడుగు.. చర్చనీయాంశంగా రాహుల్, నితీష్ భేటీ
Updated Date - 2023-04-12T17:31:12+05:30 IST