Asus: 200-మెగాపిక్సెల్ కెమెరాతో ఆసుస్ స్మార్ట్‌ఫోన్..
ABN, First Publish Date - 2023-06-24T20:43:28+05:30
తైనాన్ (Taiwan) మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆసుస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.
తైనాన్ (Taiwan) మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆసుస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అద్భుతమైన ఫీచర్లతో ఆసుస్ జెన్‌ఫోన్ 10( Asus Zenfone 10) స్మార్ట్‌ఫోన్లను (smartphone) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
జూన్ 29న మార్కెట్‌లోకి ఆసుస్ జెన్‌ఫోన్ 10 స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా.. కొత్త జెన్‌ఫోన్ ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. జెన్‌ఫోన్ 10 ఫోన్ 5 కలర్లలో వస్తుందని, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCపై నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఆసుస్ జెన్‌ఫోన్ 10 ఆండ్రాయిడ్ 13తో పని చేయనుంది. ఈ ఫోన్లలో రెండు ర్యామ్స్ 8జీబీ, 16జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. 256జీబీ నుంచి 512జీబీ వరకు స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. 200-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. ఆసుస్ జెన్‌ఫోన్ 10 ఫోన్ రూ. 62,000 ఉండవచ్చని అంచనా. జూన్ 29న న్యూయార్క్‌లో ఉదయం 9.00 గంటలకు ఫోన్లను విడుదల చేయనున్నారు.
Updated Date - 2023-06-24T20:43:44+05:30 IST