ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tech Tips: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ ఫాస్ట్‌గా పనిచేయాలంటే..కొన్ని చిట్కాలు..

ABN, First Publish Date - 2023-07-12T22:20:42+05:30

మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ పనీతీరులో మార్పు వచ్చిందా.. మునుపటిలా వేగంగా పనిచేయడం లేదా? మీ ఫోన్ పనితీరులో మార్పుకు కారణం ఏంటో తెలుసుకుని మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు వేగవంతం చేయాలంటే కొన్ని చిట్కాలు మీకోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ పనీతీరులో మార్పు వచ్చిందా.. ?మునుపటిలా వేగంగా పనిచేయడం లేదా? మీ ఫోన్ పనితీరులో మార్పుకు కారణం ఏంటో తెలుసుకుని మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరు వేగవంతం చేయాలంటే కొన్ని చిట్కాలు మీకోసం..

క్యాచ్డ్ డేటాను ఎప్పటికప్పుడు తొలగించాలి

ఆండ్రాయిడ్ ఫోన్ మనం ఉపయోగించే కొద్దీ క్యాచ్ ఫైల్స్‌ను పోగేస్తుంది. దీంతో ఫోన్ పనితీరులో వేగం తగ్గుతుంది. Setting> Storageలోకి వెళ్లి క్యాష్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.

అనవసర యాప్‌లను తొలగించాలి

అనసవర యాప్‌లను తొలగించడం ద్వారా కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరును వేగవంతం చేసుకోవచ్చు. మీ యాప్ డ్రాయర్‌ను పరిశీలించి అరుదుగా ఉపయోగించే లేదా అవసరం లేని యాప్‌లను గుర్తించి అన్ ఇన్‌స్టాల్ చేయండి. దీంతో మీ స్టోరేజ్ ఖాళీ కావడమే కాకుండా బ్యాగ్ గ్రౌండ్ ప్రాసెస్‌లను తగ్గిస్తుంది.. ఫోన్ పనితీరు వేగవంతం అవుతుంది.

యానిమేషన్లను సాధ్యమైనంతవరకు తగ్గించాలి లేదా డిసేబుల్ చేయాలి

మీ ఫోన్ మెరుగైన పనితీరును కనబర్చాలంటే.. తప్పనిసరిగా యానిమేషన్లను నిలిపివేయాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి about Phone ను ఏడుసార్లు నొక్కడం ద్వారా యానిమేషన్లను నిలిపివేయవచ్చు.


సిస్టమ్ సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా పనితీరు వేగవంతం అవుతుంది. Setting>Software Updatesలోకి వెళ్లి అప్‌డేట్ చేయాల్సిన ఏవైనా ఉంటే అప్‌డేట్ చేయడం ద్వారా ఫోన్ స్పీడప్ అవుతుంది.

తేలికైన యాప్‌లను వినియోగించండి

కొన్ని యాప్‌లు తక్కువ సిస్టమ్ స్టోరేజీని, తక్కువ మెమెరీని వినియోగిస్తాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరును మెరుగు పర్చాలంటే రీసోర్స్ ఇంటెన్సివ్ యాప్‌లను రీప్లేస్ చేయాలి.

యాప్ క్యాచ్డ్ ‌ఫైల్స్‌ను క్లియర్ చేయాలి

మీ ఫోన్ పనితనం వేగవంతం కావాలంటే యాప్ క్యాచ్డ్ ఫైల్స్‌ను తొలగించాలి. దీనికోసం Setting> Apps> Storage> Clear Cache ద్వారా మీ ఫోన్‌ను స్పీడప్ చేసుకోండి.

తరుచుగా ఫోన్ రీస్టార్ట్ చేస్తుండాలి

ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడప్ కావాలంటే చేయాల్సిన మరోపని ఫోన్ రీస్టార్ట్ చేయడం. రీస్టార్ట్ చేయడం ద్వారా మెమరీతోపాటు, ఏదైతే మన ఫోన్‌ను స్లోడౌన్ చేస్తున్న డేటా ఏదైతే ఉందో అంతా క్లియర్ అవుతుంది. కనీసం వారానికి ఒక రోజైనా మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తుండాలి.

చివరగా ఫ్యాక్టరీ రీసెట్

పై ఆప్షన్ల అన్నీ ఉపయోగించినా మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడప్ కాకపోతే.. ఇక చివరగా మిగిలింది ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్. ఈ ఆప్షన్ నొక్కిన తర్వాత ఫోన్ స్పీడప్ అవుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లయితే.. మొబైల్ ఉన్న డేటా అంతా డెలిట్ అవుతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో చివరగా ఈ ఆప్షన్ ఉపయోగించాలి.

Updated Date - 2023-07-12T22:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising