Thomson: తక్కువ ధరకే థామ్సన్ కొత్త స్మార్ట్‌టీవీలు... ఫీచర్స్ ఇవే..
ABN, First Publish Date - 2023-05-30T20:40:35+05:30
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ థామ్సన్ (Thomson) తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.
హైదరాబాద్: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ థామ్సన్ (Thomson) తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా థామ్సన్ ఇండియా (Thomson India) లైసెన్సీ బ్రాండ్ ఎస్‌పీపీఎల్ (SPPL) భారత మార్కెట్‌లో స్మార్ట్ టీవీలను (Smart TV) విడుదల చేసింది. 50 అంగుళాల నుంచి 32 అంగుళాల సైజ్ ఉన్న థామ్సన్ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీలను విడుదల చేసినట్లు థామ్సన్ లైసెన్సీ బ్రాండ్ ఎస్‌పీపీఎల్ పేర్కొంది. 50 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ రూ.27,999 ఉండగా, 43 అంగుళాల టీవీ రూ. 22,999 ఉంటుంది.
32, 40, 42 అంగుళాల సైజ్‌లో కూడా థామ్సన్ అందుబాటులో ఉన్నాయి. కొత్త టీవీలను బ్యాంకు ఆఫర్లతో ఫ్లీప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 32 అంగుళాల హెచ్‌డీ టీవీ రూ. 10,499 ఉండగా, 40 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ టీవీ రూ. 15,999 ఉంటుంది. 42 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ టీవీ రూ. 16,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది.
తొలి ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా టీవీలను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10 శాతం తగ్గింపు లభిస్తోంది. గరిష్టంగా రూ. 1,500 తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ రూ. 8,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై వర్తిస్తుంది. రెండవ ఆఫర్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ రూ. 15,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై చెల్లుబాటు అవుతుందని సంస్థ తెలిపింది.
థామ్సన్ స్మార్ట్‌టీవీల ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
రెండు కొత్త థామ్సన్ 4కే టీవీలు గూగుల్ టీవీ ఓఎస్ పని చేయనున్నాయి. ఇవి ఎంపిక చేసిన థామ్సన్ స్మార్ట్ టీవీలలో కూడా ఉంటాయి. టీవీలలో 40డబ్లూ స్పీకర్లు, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, డ్యూయల్-బ్యాండ్ (2.4GHz + 5GHz) వైఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది.
Updated Date - 2023-05-30T20:42:22+05:30 IST