ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Youtube: కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ శుభవార్త.. ఇకపై 500 మంది సబ్‌స్ర్కైబర్లు ఉంటే చాలు...

ABN, First Publish Date - 2023-06-14T18:28:24+05:30

యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పటికీ తగిన సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు లేకపోవడంతో ఆదాయం పొందలేకపోతున్న చిన్నచిన్న యూట్యూబ్ ఛానళ్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. మోనిటైజేషన్‌కు అవసరమైన సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1000 నుంచి 500లకు తగ్గింది. ఈ మేరకు గూగుల్ సారధ్యంలోని యూట్యూబ్ వెల్లడించింది. దీంతో మోనిటైజేషన్‌కు సంబంధించి కంపెనీ పెద్ద మార్పు తీసుకొచ్చినట్టయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పటికీ తగిన సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు లేక ఆదాయం పొందలేకపోతున్న చిన్నచిన్న యూట్యూబ్ ఛానళ్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చింది. మోనిటైజేషన్‌కు (Youtube monitization) అవసరమైన సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1000 నుంచి 500లకు తగ్గింది. ఈ మేరకు గూగుల్ సారధ్యంలోని యూట్యూబ్ వెల్లడించింది. దీంతో మోనిటైజేషన్‌కు సంబంధించి కంపెనీ పెద్ద మార్పు తీసుకొచ్చినట్టయ్యింది. తక్కువ సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్న యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం మోనిటైజేషన్ విధానాలను మరింత సులభతరం చేయడం, యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు వివరించింది.

కాగా గతంలో యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలన్నా, మోనిటైజేషన్ జరగాలన్నా పలు ప్రమాణాలు ఉండేవి. అయితే కొత్త విధానంలో కేవలం 500 మంది సబ్‌స్ర్కైబర్లు ఉంటే సరిపోతుంది. గతంలో ఇది 1000గా ఉండేదన్న విషయం తెలిసిందే.

వాచ్ అవర్స్ కూడా తగ్గింపు...

సబ్‌స్ర్కైబర్ల సంఖ్య తగ్గించడంతోపాటు వాచ్ అవర్స్ ప్రమాణాన్ని (Watch hours) తగ్గింది. గతంలో 4000 గంటలు ఉండగా ఇప్పుడు దానిని 3000 గంటలకు కుదించింది. షార్ట్ వీడియోస్‌కు సంబంధించిన అర్హతను 10 మిలియన్ల నుంచి 3 మిలియన్లకు తగ్గించింది. అయితే ఈ నూతన ప్రమాణాలను తొలుత అమెరికా, యూకే, కెనడా, తైవాన్, దక్షిణా కొరియాల్లో అమల్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత క్రమంలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

కాగా యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ఫలితంగా చిన్నచిన్న కంటెంట్ క్రియేటర్లు కూడా యాడ్ రెవెన్యూ పొందేందుకు మార్గం సుగుమమైంది. ప్రమాణాల్లో మార్పులు వచ్చినప్పటికీ రెవెన్యూ షేరింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. కాగా ఇప్పటికే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కి అర్హత సాధించినవారు కొత్త అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాగా యూట్యూబ్ మోనిటైజేషన్ ప్రమాణాలు తగ్గిన తీరు చూస్తుంటే చిన్నస్థాయ కంటెంట్‌ క్రియేటర్ల పట్ల సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Updated Date - 2023-06-14T18:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising